కోవిడ్‌ సెగ: రోడ్డెక్కని 2 లక్షల బస్సులు  

Covid impact on travelling industry 2 lakhs busses effected Boci President - Sakshi

     కోవిడ్‌ ఎఫెక్ట్‌తో మూలకు బోవోసీఐ ప్రెసిడెంట్‌ ప్రసన్న

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కారణంగా సుమారు 2 లక్షల ప్రైవేట్‌ బస్సులు మూలన పడ్డాయని బస్, కార్‌ ఆపరేటర్స్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీవోసీఐ) వెల్లడించింది. ఇవి రోడ్డెక్కాలంటే ఆపరేటర్లు ఒక్కో బస్‌కు కనీసం రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సిందేనని బీవోసీఐ ప్రెసిడెంట్‌ ప్రసన్న పట్వర్ధన్‌ తెలిపారు. దేశంలో 10లోపు బస్‌లు కలిగి ఉన్న చిన్న ఆపరేటర్లు 90 శాతం ఉంటారని, వీరికి ఈ వ్యయాలు భారమేనని చెప్పారు.

(ఇది చదవండి : వోల్వో-ఐషర్‌ కొత్త ఇంటర్‌ సిటీ బస్సులు)

ప్రవాస్‌ 3.0 పేరుతో ఇక్కడి హైటెక్స్‌లో ప్రారంభమైన ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ షోలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సేవల రంగంలో ఇప్పటికీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో కార్యాలయాలకు రావడం లేదు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో బస్‌లకు డిమాండ్‌ ఆశించినట్టు లేదు. మరోవైపు స్కూల్‌ బస్‌లకు కొరత ఉంది. దేశంలో 2021-22లో అన్ని రకాల బస్‌లు సుమారు 20,000 యూనిట్లు అమ్మడయ్యాయి. మొత్తం 19 లక్షల బస్‌లు పరుగెడుతున్నాయి. వీటిలో 17.7 లక్షలు ప్రైవేట్‌ ఆపరేటర్లవి. మిగిలినవి వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్‌ రెండింతలు అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్‌ బస్‌ల విషయంలో తయారీ సంస్థలు సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నాయి’ అని వివరించారు.

 చదవండి : ఝన్‌ఝన్‌వాలా జాక్‌పాట్‌:టైటన్‌ మెరిసెన్‌

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top