మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా ఇలా మార్చేయండి....!

Convert Your Normal Tv Into Smart Tv - Sakshi

ప్రస్తుత కాలంలో టీవీలు లేని ఇళ్లు ఉన్నాయంటే చాలా అరుదు.  పెరుగుతున్న సాంకేతికతో పాటుగా టీవీల పరిణామ క్రమంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. పిక్చర్‌ట్యూబ్‌ టీవీల నుంచి  స్మార్ట్‌టీవీల వరకు టీవీల పరిణామ క్రమం ఎదిగింది. ప్రస్తుతం స్మార్ట్‌టీవీల రాకతో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలో వచ్చే వీడియోలను నేరుగా టీవీల్లో పెద్ద స్క్రీన్‌పై చూడవచ్చును. ఈ ఫీచర్‌ కేవలం స్మార్ట్‌ టీవీలకు మాత్రమే వర్తిస్తుంది. 

ఓటీటీ ప్లాట్‌ఫాం వీడియోలను కేవలం స్మార్ట్‌ టీవీల్లో చూడగల్గుతాం అనుకుంటే మీరు పొరపడినట్లే..! మీ ఇంట్లోని పాత ఎల్‌ఈడీ లేదా ఎల్‌సీడీ టీవీలను కొన్ని ప్రత్యేకమైన గాడ్జెట్లను ఉపయోగించి స్మార్ట్‌టీవీగా తయారుచేయవచ్చును.   ప్రస్తుతం మీ ఇంట్లోని టీవీలకు హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌ ఉన్నట్లయితే స్మార్ట్‌ టీవీలుగా ఇట్టే మార్చేయచ్చు. దాంతో పాటుగా ఇంట్లో వై-ఫై కనెక్టివీటి కూడా అవసరం. మీ పాత టీవీని స్మార్ట్ టీవీగా మార్చేందుకు మార్కెట్‌లో పలు రకాల గాడ్జెట్స్‌ అందుబాటులో​ ఉన్నాయి.

 
1. అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌
అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌తో మీ పాత టీవీలను స్మార్ట్‌ టీవీలుగా మార్చవచ్చును. అలెక్సానుపయోగించి వాయిస్‌ కంట్రోల్‌ ద్వారా ఓటీటీ యాప్‌లను ఇట్టే పొందవచ్చును. ఫైర్‌ స్టిక్‌ను హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌లో ఉంచి వైఫైకు కనెక్ట్‌ చేయాలి. దీని ధర రూ. 3,999.

2. టాటా స్కై బింజీ+ 
టాటా స్కై బింజీ సెటప్‌ బాక్స్‌తో పాత టీవీను స్మార్ట్‌ టీవీలుగా మార్చవచ్చును. టాటా స్కై బింజీ+ తో వినియోగదారులు తమ ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్‌లో ప్లే చేసే వీడియోలను టీవీలో చూడవచ్చును. టాటా స్కై బింజీ+లో క్రోమ్‌కాస్ట్‌ ఫీచరును ఏర్పాటు చేశారు.  హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌తో స్మార్ట్‌ టీవీగా చేయవచ్చును. దీని ధర రూ. 3,999.

3. షావోమీ ఎమ్‌ఐ బాక్స్‌ 4కే 
షావోమీ ఎమ్‌ఐ బాక్స్‌ 4కే బాక్స్‌తో మీ పాత టీవీని స్మార్ట్‌టీవీగా మార్చవచ్చు. అంతేకాకుండా ఈ గాడ్జెట్‌తో గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్‌లను కూడా యాక్సెస్‌ చేయవచ్చును. డాల్బీ అట్మోస్‌ను సపోర్ట్‌ చేస్తుంది. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఎమ్‌ఐ బాక్స్ 4కే ను నియంత్రించవచ్చు. ఈ పరికరం హెచ్‌డీఎమ్‌ఐ, యూఎస్‌బీ 2.0, బ్లూటూత్‌ను సపోర్ట్‌ చేస్తుంది. దీని ధర రూ. 3,499.

4.యాక్ట్‌ స్ట్రీమ్‌ టీవీ 4 కే బాక్స్‌
యాక్ట్‌ ఫైబర్‌నెట్‌కు చెందిన యాక్ట్‌ స్ట్రీమ్‌ టీవీ 4కే బాక్స్‌తో ఏ రకమైన ఎల్‌ఈడీ టీవీలను స్మార్ట్‌ టీవీగా చేయవచ్చును. ఈ గాడ్జెట్‌లో సుమారు 8 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 4,499.

5. ఎయిర్‌ టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్  బాక్స్‌
ఎయిర్‌ టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ 9  ఆపరేటింగ్ సిస్టమ్‌ను  కల్గి ఉంది. గూగుల్ అసిస్టెంట్‌ ఉండడటంతో వాయిస్‌ కమాండ్స్‌తో కంట్రోల్‌ చేయవచ్చును దీని ధర రూ.  3,999.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top