ఆమెకు మూడు చేతులు..! | ChatGPT Ghibli Style Art Sparks Laughter with a Third Hand | Sakshi
Sakshi News home page

Ghibli: ఆమెకు మూడు చేతులు..!

Apr 1 2025 2:20 PM | Updated on Apr 5 2025 5:40 PM

ChatGPT Ghibli Style Art Sparks Laughter with a Third Hand

సోషల్ మీడియాలో ఏఐ ఆర్ట్‌ స్టూడియో జీబ్లీ ట్రెండ్ కొనసాగుతోంది. చాట్‌జీపీటీ, గ్రోక్‌ వంటి జనరేటివ్‌ ఏఐ చాట్‌బాట్‌ల ద్వారా టెక్ట్స్‌ ఇచ్చి ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేస్తే అందుకు తగ్గుట్టుగా గ్రాఫిక్‌ ఇమేజ్‌ జనరేట్‌ అవుతుంది. దాంతో చాలామంది వినియోగదారులు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక డెంటిస్ట్‌ తాను అప్‌లోడ్‌ చేసిన ఇమేజ్‌కు చాట్‌జీపీటీ అందించిన జీబ్లీ గ్రాఫిక్‌ ఇమేజ్‌ను చూసి కంగుతిన్నారు.

స్నిగ్ధ శర్మ అనే డెంటిస్ట్‌ చాట్‌జీపీటీలో తన ఫొటోను అప్‌లోడ్‌ చేసి బీజ్లీ ఇమేజ్‌ జనరేట్‌ చేయాలనుకున్నారు. తాను గడ్డం కింద చేతులు పెట్టినట్లు పోజిచ్చిన ఫోటోను అప్‌లోడ్‌ చేశారు. కానీ చాట్‌జీపీటీ మాత్రం మూడు చేతులతో యూజర్‌ ఫోటోను జీబ్లీ వర్షన్‌లో అందించింది. రెండు చేతులు ఒరిజినల్‌ ఫొటోలో మాదిరి గడ్డం కింద చేతులు పెట్టుకున్నట్లుగా ఉంటే.. మరో చేతితో ఐస్‌క్రీమ్‌ తింటున్నట్లు ఇమేజ్‌ జనరేట్‌ అయింది. దీనిపై డెంటిస్ట్‌ స్పందిస్తూ ‘మీరెప్పుడూ ఇలా చేసి ఉండరు’ అని పోస్ట్‌ చేశారు. దీన్ని కాస్తా ఆ డెంటిస్ట్‌ సరదాగా తన ఇన​్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. దాంతో అది వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: 60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లు

ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మూడు చేతులున్న తన ఫొటో చూసిన వారు నవరాత్రి ఉత్సవాల్లో కాళిమాతగా కొందరు కామెంట్‌ చేశారు. ‘ఒకేసారి రెండు మొబైల్‌ ఫోన్లలో చాటింగ్‌ చేయొచ్చు’ అని కొందరు తమ అభిప్రాయాలను పోస్ట్‌ చేశారు. ఏఐ జనరేట్‌ చేసే ఫోటోలు కేవలం సరదాకోసం మాత్రమేనని గ్రహించాలి. ఏఐ కూడా చాలాసార్లు పొరపాటు చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. అందుకే ఏఐ కంటెంట్‌పై పూర్తిగా ఆధారపడకుండా మ్యానువల్‌గా క్రాస్‌ చెక్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్ఏఐకు చెందిన గ్రోక్ చాట్‌బాట్‌, గూగుల్ జెమినీ వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఇలా ఏఐ ఇమేజ్‌ను సృష్టిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement