మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకపోతే మోతే.. ఈ బ్యాంకులో కొత్త ఛార్జీలు | Charges For Not Maintaining Average Monthly Balance In DBS Bank From August 1, More Details Inside | Sakshi
Sakshi News home page

మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకపోతే మోతే.. ఈ బ్యాంకులో కొత్త ఛార్జీలు

Jun 26 2025 9:07 AM | Updated on Jun 26 2025 4:53 PM

Charges for not maintaining average monthly balance in DBS Bank from August 1

కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమమ్‌ బ్యాలెన్స్‌ నిర్వహణ ఛార్జీలను తొలగిస్తున్నప్పటికీ మరికొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు మాత్రం ఖాతాదారులపై కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలను మోపుతున్నాయి. తాజాగా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) ఇండియా సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్‌ను నిర్వహించకపోతే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఆగస్టు 1 నుండి బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్‌ను నిర్వహించకపోతే ఎంత అయితే లోటు ఉంటుందో దానిపై 6% రుసుము చెల్లించాలి. డీబీఎస్ బ్యాంక్ ఇండియా వెబ్సైట్ ప్రకారం.. బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఛార్జీలు లోటులో 6% ఉంటాయి. ఇది గరిష్టంగా రూ .500 ఉంటుంది. డీబీఎస్ బ్యాంక్‌ రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) రూ .10,000 నిర్వహించాల్సి ఉంటుంది.

కాగా డీబీఎస్ బ్యాంక్ ఇప్పటికే ఏటీఎం నగదు ఉపసంహరణ రుసుమును పెంచింది. ఉచిత పరిమితికి మించి ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలకు గరిష్టంగా రూ .23 వసూలు చేయడానికి బ్యాంకులను అనుమతించే ఆర్బీఐ నోటిఫికేషన్ తరువాత, డీబీఎస్ బ్యాంక్ తన రుసుమును అప్డేట్ చేసింది. మే 1 నుండి ఉచిత పరిమితికి మించి నాన్ డీబీఎస్ బ్యాంక్ ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలపై రూ.23 వసూలు చేస్తోంది. అయితే డీబీఎస్ బ్యాంక్ ఏటీఎంలలో ఎటువంటి రుసుము లేకుండా అపరిమితంగా నగదును ఉపసంహరించుకోవచ్చు.

👉 ఎక్కువగా వాడే క్రెడిట్‌ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు 👈

Advertisement
 
Advertisement
Advertisement