కొచ్చర్‌ కేసులో సంచలనం.. రూ.5.25 కోట్ల ప్లాట్‌ ఖరీదు రూ.11 లక్షలే!

Chanda Kochhar Purchased Rs 5 Cr Flat For Rs 11 Lakh From Venugopal Dhoot - Sakshi

ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణంలో వీడియోకాన్‌ గ్రూప్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్‌ అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు లోన్‌ కేసులో ప్రధాన నిందితులైన చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌తో పాటు వేణుగోపాల్‌ ధూత్‌ స్టేట్మెంట్‌ను రికార్డ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు నిందితుల మధ్య జరిగిన లావాదేవీలను పరిశీలించగా అందులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

కొచ్చర్‌ దంపతులకు లంచాలు ఎలా ఇచ్చారంటే?
ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవోగా చందా కొచ్చర్‌ ఆర్‌బీఐ బ్యాంక్‌లకు విధించిన బ్యాంకింగ్‌ రెగ్యూలేషన్‌ యాక్ట్‌, క్రెడిట్‌ పాలసీ (రుణ) నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌కు రూ.3250 కోట్లలోన్‌ మంజూరు చేశారు. అందుకు గాను ధూత్‌.. కొచ్చర్‌ కుటుంబానికి లంచాలు ఇచ్చినట్లు అధికారుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.  

వడ్డీతో పాటు షేర్‌ కూడా 
రుణం మంజూరు తర్వాత భార్య భర్తలైన చందాకొచ్చర్‌, దీపక్‌ కొచ‍్చర్‌కు వేణుగోపాల్‌ ధూత్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రుణం విషయంలో అనుకూలంగా వ్యవహరించారనే కారణంగా ధూత్‌ తన వీడియోకాన్‌ గ్రూప్‌లో ఆ సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవోగా చందాకొచ్చర్‌కు షేర్‌ ఇవ్వడంతో పాటు సంస్థ నుంచి వచ్చిన లాభాల్లో అధిక మొత్తంలో వడ్డీ ఇచ్చారు. పైగా తన ఖరీదైనా ప్లాటులో నివాసం ఉండేలా కొచ్చర్‌ దంపతులు ఇచ్చారు. 

అప్పు తీర్చేందుకు అప్పుగా రూ.300 కోట‍్ల రుణం 
సీఈవో పదవితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌ శాంక్షనింగ్ కమిటీ చైర్‌ పర్సన్‌గా ఉన్న చందా కొచ్చర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ పదవిలో(శాంక్షనింగ్  కమిటీ చైర్ పర్సన్‌ గా) ఉన్న ఆమె బ్యాంక్‌ యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (వీఐఎల్)కు రూ.300కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ రుణాన్ని వీడియోకాన్‌ గతంలో అదే బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు.. కొత్తగా వందల కోట్లను రుణాన్ని ఇచ్చింది. ఆ తర్వాత శాక్షనింగ్‌ కమిటీ పదవి నుంచి తప్పుకుంది.  

రూ.64కోట్లు ముడుపులు
అందుకు ప్రతిఫలంగా వీడియోకాన్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌..చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు చెందిన న్యూ పవర్‌ రెన్యూవబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (nrpl) సంస్థ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.64 కోట్లు ముడుపులుగా ఇచ‍్చినట్లు సీబీఐ తన ఇన్వెస్టిగేషన్‌లో గుర్తించింది.  ఆ రూ.64 కోట్లతో దీపక్‌ కొచ్చర్‌ 33.15 మెగా వాట‍్ల కెపాసిటీతో  విండ్‌ ఫార్మ్‌ ప్రాజెక్ట్‌ కావాల్సిన భారీ ఎత్తున చిన్న చిన్న విండ్‌ టర్బైన్లను కొనుగోలు చేశారు. 

రూ.5.25 కోట్ల ప్లాట్‌ ఖరీదు రూ.11 లక్షలే 
చందా కొచ్చర్, ఆమె కుటుంబం వేణుగోపాల్‌ ధూత్‌ నుంచి అన్నీ రకాల లబ్ధి పొందినట్లు దర్యాప్తు అధికారులు విచారణలో స్పష‍్టమైంది. పైన పేర్కొన్నుట్లుగా రూ.64 కోట్లతో పాటు ముంబైలోని సీసీఐ ఛాంబర్స్‌లో ఉన్న రూ.5.25 కోట్ల ఖరీదైన ఫ్లాటును 1996 నుంచి 2016 వరకు ఫ్రీగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత అదే ప్రాపర్టీని రూ.11లక్షలకు కొనుగోలు చేసిన వీడియోకాన్‌ గ్రూప్‌ తెలిపింది. ఈ లావాదేవీలు 2016 లో జరిగాయి. కానీ ఈ ప్లాట్‌ కొనుగోలు మాత్రం సంవత్సరాల ముందు నుంచి ఒప్పందం జరిగినట్లు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top