Wipro CFO Jatin Dalal: జీతాలు తక్కువే ఇస్తామంటున్నా.. ఉద్యోగులు ఎగబడుతున్నారు.. కారణం ఇదే!

Cfo Jatin Dalal Said 92 Percent Freshers To Join Wipro - Sakshi

ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం విప్రో తీరు టెక్నాలజీ రంగంలో చర్చాంశనీయంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, ఆర్థిక మాంద్యం ముందస్తు భయాలు వంటి కారణాలతో ఆయా దిగ్గజ టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న విషయం తెలిసిందే. 

అయితే ఈ తరుణంలో విప్రో ఫ్రెషర్స్‌ నియామకాల్ని 50 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలుగా నిర్ణయించింది. కొద్ది రోజులకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ భారీ ఎత్తున జీతాల కోత విధించింది. దీనిపై టెక్నాలజీ రంగ నిపుణులు, ఫ్రెషర్స్‌ విప్రో తీరును తప్పుబట్టారు. 

ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడం లేదు
దీనిపై అయితే, ప్రొడక్ట్‌లు, అవకాశాలు వంటి విషయాల్లో టెక్నాలజీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, కాబట్టే ఫ్రెషర్స్‌కు ఇచ్చే వేతనాల్ని తగ్గించి విధుల్లో తీసుకోవాల్సి వచ్చినట్లు విప్రో ఓ ప్రకటనలో తెలిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ తామెవరినీ తక్కువ ప్యాకేజీలకు ఉద్యోగంలో చేరాలని బలవంతం చేయలేదని, సంస్థ అందించే వేతనం కావాలనుకుంటే ఇప్పటికీ విప్రోలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 

కంపెనీ ఆఫర్‌కే అంగీకారం  
తాజాగా, సంస్థలోని ఫ్రెషర్ల నియామకాలు, వారికి అందించే జీతభత్యాలపై విప్రో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జతిన్‌ దలాల్‌ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విప్రోలో 92 శాతం మంది ఫ్రెషర్లు తాము అందించే ఆఫర్‌కు అంగీకరించి ఆయా ప్రాజెక్ట్‌లలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ‘ఫ్రెషర్లకు సంబంధించిన నిర్ణయాలు పూర్తి న్యాయంగా, పారదర్శకతతో తీసుకుంటున్నట్లు జతిన్‌ దలాల్‌ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా ఫ్రెషర్స్‌ను ఏడాది పొడవునా సంబంధిత ప్రాజెక్ట్‌లలో కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. 


 
ఆప్షన్‌లు మాత్రమే ఇస్తాం.. ఉద్యోగులదే తుది నిర్ణయం 
ఉద్యోగులకు మేం ఆప్షన్‌లు మాత్రమే ఇస్తాం. కంపెనీలో చేరుతారా? లేదా అనేది వాళ్లు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు సైతం ఉద్యోగుల శ్రేయస్సు కోరే విధంగా ఉంటాయి. కాబట్టే, ఫ్రెషర్లు ఎక్కువ ప్యాకేజీలు తీసుకొని ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూడకుండా.. కంపెనీ ఆఫర్‌ చేసిన జీతానికి కంపెనీలో చేరాలని నిర్ణయించుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఫ్రెషర్స్‌ వేతనాల తగ్గింపు 
ఈ ఏడాది మార్చి నెలలో విజయవంతంగా ట్రైనింగ్‌ పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కు ప్రారంభ వేతనం రూ.6.5 లక్షలు ఇస్తామని తెలిపింది. ఆ తర్వాత రూ.6.5 లక్షల ప్యాకేజీని కాస్త రూ.3.5లక్షలకు కుదించింది. దీనిపై మేం ఇచ్చే ఆఫర్‌కు ఒప్పుకోవాలని ఫ్రెషర్స్‌పై ఒత్తిడి తేవడం లేదు. తక్కువ ఆఫర్‌తో ఆన్‌బోర్డ్‌లోకి బోర్డులోకి వెళ్లాలనుకుంటున్నారా? అని నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

కస్టమర్‌ల అవసరాల్ని గమనిస్తున్నాం
మా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగానే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కస్టమర్ అవసరాలను అంచనా వేస్తున్నాం. ఇది మా నియామక ప్రణాళికలకు కారణమవుతుంది. ప్రస్తుతం, మాకు రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో విధులు నిర్వహించే ఇంజినీర్లు అందుబాటులో పొందిన ఫ్రెషర్‌లకు పంపిన ఇమెయిల్‌లో కంపెనీ పేర్కొంది.

చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top