మరో కారు లాంచ్ చేసిన బీవైడీ: ధర ఎంతంటే? | BYD Atto 1 EV Launched at 2026 Bangkok International Motor Show | Sakshi
Sakshi News home page

మరో కారు లాంచ్ చేసిన బీవైడీ: ధర ఎంతంటే?

Mar 28 2026 9:17 PM | Updated on Mar 28 2026 9:20 PM

BYD Atto 1 EV Launched at 2026 Bangkok International Motor Show

చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ.. అట్టో 1 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను '2026 బ్యాంకాక్ అంతర్జాతీయ మోటార్ షో'లో లాంచ్ చేసింది. దీని ధరలు భారతీయ కరెన్సీ ప్రకారం రూ.12.29 లక్షల నుంచి రూ. 13.15 లక్షలు.

బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ అట్టో కంటే భిన్నంగా ఉంది. ఇది క్లోజ్డ్ గ్రిల్, ఎయిర్ వెంట్లు, రెట్రో-స్టైల్ డోర్ హ్యాండిల్స్, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, కుడి వైపు ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్‌పై ఛార్జింగ్ ఫ్లాప్, కనెక్టెడ్ టెయిల్ లైట్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి పొందుతుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇది 7 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అడ్జస్టబుల్ స్టీరింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, నాలుగు డిస్క్ బ్రేకులు, మూడు రాడార్లతో కూడిన రియర్-వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

బీవైడీ అట్టో 1 ఎలక్ట్రిక్ కారు 38.88kWh బ్లేడ్ LFP బ్యాటరీ ప్యాక్‌తో 380 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 74 Bhp పవర్, 135 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. భద్రతా ఫీచర్లలో EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement