సెన్సెక్స్‌ డెరివేటివ్స్‌పై బీఎస్‌ఈ దృష్టి | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ డెరివేటివ్స్‌పై బీఎస్‌ఈ దృష్టి

Published Sat, Mar 4 2023 3:38 AM

BSE Working To Revive Sensex-30 Derivatives - Sakshi

కోల్‌కతా: స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్‌ఈ తిరిగి సెన్సెక్స్‌–30 డెరివేటివ్స్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. సభ్యుల నుంచి ఇందుకు అవసరమైన సూచనలు, వివరాలను సేకరిస్తున్నట్లు బీఎస్‌ఈ ఎండీ, సీఈవో సుందరరామన్‌ రామమూర్తి వెల్లడించారు. ప్రధాన ఇండెక్స్‌ సెన్సెక్స్‌లో భాగమైన 30  షేర్లలో ఆప్షన్స్, ఫ్యూచర్స్‌(డెరివేటివ్స్‌)ను 2000లో బీఎస్‌ఈ ప్రవేశపెట్టింది. అయితే ప్రత్యర్థి ఎక్సే్ఛంజీ ఎన్‌ఎస్‌ఈలో భాగమైన నిఫ్టీ–50 డెరివేటివ్స్‌తో పోలిస్తే ఇన్వెస్టర్ల నుంచి తగిన ఆసక్తిని సాధించలేకపోయింది.

దీంతో మరోసారి సెన్సెక్స్‌–30 డెరివేటివ్స్‌ ప్రొడక్టులను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు రామమూర్తి తెలియజేశారు. దీనిలో భాగంగా మార్కెట్‌ పార్టిసిపెంట్ల ద్వారా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అసో చామ్‌ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా రామమూర్తి సెన్సెక్స్‌ దిగ్గజాలలో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను ప్రవేశపెట్టడంపై వివరాలు వెల్లడించారు. వెరసి ఎఫ్‌అండ్‌వో విభాగం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలో మెరుగుపరచవలసిన అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు.

బీఎస్‌ఈలో అత్య ధికంగా ట్రేడయ్యే 30 బ్లూచిప్‌ కంపెనీలు సెన్సెక్స్‌లో భాగమయ్యే సంగతి తెలిసిందే. వీటిలో డెరివేటివ్స్‌ను పునఃప్రారంభించే సన్నాహాల్లో ఉన్న ట్లు రామమూర్తి పేర్కొన్నారు. నిఫ్టీ–50తో పోలిస్తే సెన్సెక్స్‌–30 డెరివేటివ్స్‌ కొంత విభిన్నంగా ఉండనున్నట్లు సూ చించారు. ఒకే విధమైన రెండు విభిన్న ప్రొడక్టులు అందుబాటులో ఉన్నపుడు వివిధ ట్రేడింగ్‌ వ్యూ హాలు, ఇంటర్‌ప్లే ద్వారా మార్కెట్లు మరింత వృద్ధి చెందేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement