
బీఎండబ్ల్యూ మోటోరాడ్ దేశీయ విఫణిలో తన ఉనికిని విస్తరించడంతో బిజీ అయిపోయింది. ఇటీవల సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇప్పుడు సీఈ 02ను లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. రూ. 14.90 లక్షలు ఖరీదైన సీఈ04 ప్రస్తుతం దేశంలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా అవతరించింది.
బీఎండబ్ల్యూ సీఈ 02 అనేది సీఈ04 కంటే సరసమైనదిగా ఉండనున్నట్లు సమాచారం. ఇది ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ఎలక్ట్రిక్ కారు స్కూటర్ కాదని కంపెనీ వెల్లడించింది. అయితే 310 సీసీ విభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
సీఈ02 స్కూటర్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ వెహికల్స్ ధరలు, ఇంజిన్ వంటి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.