అమెరికాలోని ఫిలడెల్ఫియాలో బ్లాక్‌ ఫ్రైడే సేల్‌.. కళ్లు చెదిరే ఆఫర్స్

Black Friday Sale In Philadelphia USA - Sakshi

అగ్రరాజ్యం అమెరికాలో బ్లాక్‌ ఫ్రైడే సేల్‌‌‌ సందడి మొదలైంది. యూఎస్ఏలో ప్రతి సంవత్సరం బ్లాక్‌ ఫ్రైడే పేరుతో సేల్‌ను నిర్వహిస్తుంటారు. ఏటా థాంక్స్‌ గివింగ్‌ మరునాడు వచ్చే బ్లాక్ ఫ్రైడే రోజున పెద్ద ఎత్తున షాపింగ్‌ ఫెస్టివల్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిలడెల్ఫియాలోని ప్రముఖ కంపెనీలు  బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభి.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి.

ప్రతి ఏడాది అమెరికన్లు నవంబర్‌ నాలుగో గురువారం థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ రాకను సూచిస్తూ శాంటా క్లాజ్‌ పరేడ్స్ జరుగుతుంటాయి. పెద్దపెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను అడ్వర్‌టైజ్ చేసుకునేందుకు ఈ పరేడ్లను స్పాన్సర్ చేస్తుంటాయి. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందిస్తుంటాయి.

బ్లాక్ ఫ్రైడే సందర్భంగా చాలా కంపెనీలు కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపులు.. కళ్లు చెదిరే ఆఫర్‌లను అందిస్తాయి. కొన్ని సంస్థలు 'బ్లాక్  థర్స్ డే' పేరుతో గురువారం నుంచే సేల్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున కస్టమర్లు షాపింగ్ చేయటానికి తరలి వచ్చారు. దీంతో అన్ని షాపులు కిటకిటలాడాయి. ఇక ప్రధాన రోడ్లతో పాటు పార్కింగ్‌ స్థలాలు రద్దీగా మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top