ఆక్సా వాటా భారతీ గ్రూప్‌ చేతికి | Bharti Group to buy out French partner AXA stake in JV | Sakshi
Sakshi News home page

ఆక్సా వాటా భారతీ గ్రూప్‌ చేతికి

Oct 12 2023 2:11 AM | Updated on Oct 12 2023 2:11 AM

Bharti Group to buy out French partner AXA stake in JV - Sakshi

న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ భాగస్వామ్య సంస్థలో ఏఎక్స్‌ఏ(ఆక్సా) వాటాను కొనుగోలు చేయనున్నట్లు భారతీ గ్రూప్‌ తాజాగా పేర్కొంది. వెరసి భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఆక్సాకుగల 49 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ తదుపరి జీవిత బీమా జేవీకి హోల్డింగ్‌ కంపెనీగా భారతీ లైఫ్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(బీఎల్‌వీపీఎల్‌) నిలవనున్నట్లు తెలియజేసింది.

100 శాతం వాటాను పొందడం ద్వారా భారతీ గ్రూప్‌ ఈ ఫీట్‌ను సాధించనుంది. ప్రస్తుతం జేవీలో ఆక్సాకు 49 శాతం వాటా ఉంది. తగిన అనుమతులు పొందాక లావాదేవీ డిసెంబర్‌కల్లా పూర్తికానున్నట్లు భారతీ అంచనా వేసింది. 2006లో ఆక్సా, భారతీ గ్రూప్‌ సంయుక్తంగా భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్, భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌లను ఏర్పాటు చేశాయి. తదుపరి 2020లో ఐసీఐసీఐ లాంబార్డ్‌కు జనరల్‌ ఇన్సూరెన్స్‌ను విక్రయించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement