StockMarketClosing: బ్లాక్ ఫ్రైడే, దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్ బాత్

దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్ బాత్
3 నెలల్లో అతిపెద్ద పతనం
ప్రపంచ మాంద్యం భయాలు
యూఎస్ ఫెడ్ భారీ వడ్డీరేటుపెంచనుందన్న అంచనాలు
రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ దేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 7.8 శాతం నుంచి 7 శాతానికి కోత
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిసాయి. అంతర్జాతీయప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక సూచీసెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకు పైగా కుప్పకూలింది. వారాంతంలో దాదాపు రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1098 పాయింట్లు కుప్పకూలి 58840వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు పతనంతో 17530 వద్ద ముగిసాయి.
వరుసగా మూడో సెషన్‌లో వచ్చిన నష్టాలతో సెన్సెక్స్ చివరికి 59వేల స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ 18వేల స్థాయి దిగువకు చేరింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, సిప్లా తప్ప మిగిలిన షేర్లన్నీ నష్టపోయాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు డాలరు మారకంలో రూపాయి 5 పైసల నష్టంతో 79.74 వద్ద ముగిసింది.