Bajaj Avenger 220 Street: అందరికి తెలిసిన బైక్ లాంచ్ చేయనున్న బజాజ్ - పూర్తి వివరాలు

Bajaj avenger 220 street relaunched in india soon - Sakshi

బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో మళ్ళీ తన అవెంజర్ 220 బైక్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న బజాజ్ క్రూజ్ 220, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 సరసన స్ట్రీట్ 220. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త అవెంజర్ 220 బైక్ చూడటానికి దాని స్ట్రీట్ 160 మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో రౌండ్ హెడ్ లాంప్, బ్లాక్డ్ అవుట్ ఇంజిన్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, పిలియన్ బ్యాక్ రెస్ట్, ఒక చిన్న ఫ్లైస్క్రీన్ మరియు ప్లాట్ హ్యాండిల్ బార్ వంటివి ఉన్నాయి.

బజాజ్ అవెంజర్ 220 బైక్ 200 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 18.7 bhp పవర్, 17.5 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ ఇంజిన్ లేటెస్ట్ బిఎస్ 6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందింది. కావున మంచి పనితీరుని అందిస్తుందని భావిస్తున్నాము.

(ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!)

ఈ బికా ధరలను ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది అవెంజర్ క్రూజ్ 220 కంటే తక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. దీని ధర బహుశా రూ. 1.40 లక్షలు ఉండవచ్చు. ఈ బైక్ గురించి గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top