తొమ్మిదో వసంతంలోకి ‘బి న్యూ మొబైల్స్‌’

B New Mobiles in to ninth Anniversary - Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్స్‌ విక్రయ సంస్థ బి న్యూ మొబైల్స్‌ ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకుని, తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన మొబైల్స్‌పై 50% వరకు స్టోర్స్‌లో, ఆన్‌లైన్‌లోనూ డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఎంపిక చేసిన టీవీలపై రూ.7వేల వరకు, లాప్‌ట్యాబ్‌లపై రూ.5వేల వరకు క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తుంది. ప్రారంభ ధర రూ.1,599కే స్మార్ట్‌ వాచ్‌లను పొందవచ్చు. ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలుపై 7.5% వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

ప్రజల నిత్య జీవనంలో కీలకమైన సెల్‌ఫోన్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులను సామాన్యులకు అందజేయడంలో బి న్యూ ముందంజలో ఉంటుందని సంస్థ సీఎండీ యరగుంట్ల బాలాజీ చౌదరి తెలిపారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో 150పైకి షో రూమ్‌లను కలిగి ఉన్నాము. తర్వలోనే మరిన్ని షోరూంలను అందుబాటులోకి తీసుకొస్తాము. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి ప్రజలకు సెల్‌ఫోన్లను తక్కువ ధరలకే అందించేందుకు గ్రామీణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టిని సారించాము’’అని బాలాజీ పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top