టెక్‌ దిగ్గజంపై అవినీతి మరక? ఇన్ఫోసిస్‌ ప్రాజెక్ట్‌పై ఆస్ట్రేలియా ప్రభుత్వం రివ్యూ!

Australian Govt Review Worth More Than 135 Million Infosys Contract - Sakshi

ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన 135 మిలియన్‌ డాలర్ల కాంట్రాక్ట్‌ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్‌పై రివ్వ్యూ నిర్వహించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఆస్ట్రేలియా ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను ప్రైవేట్‌ టెక్‌ సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఈ కాంట్రాక్ట్ గురించి ఆ దేశ ప్రభుత్వ అధికార పార్టీ లిబరల్ పార్టీ ఆఫ్‌ ఆస్ట్రేలియా ఎంపీ సువార్ట్‌ రాబర్ట్‌ ఇన్ఫోసిస్‌తో పాటు తన ఫ్రెండ్‌, బిజినెస్‌ పార్టనర్‌ జాన్ మార్గెరిసన్‌కు చెందిన కన‍్సల్టింగ్‌ సంస్థ సినర్జీ 360 తో పాటు మరో కంపెనీ యూనిసిస్‌కు లీక్‌ చేశారు. 

రాబర్ట్‌ ఈ మూడు సంస్థలకు ప్రాజెక్ట్‌కు సంబంధించిన సెన్సిటీవ్‌ ఇన్ఫర్మేషన్‌ షేర్‌ చేయడంతో భారీ ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను ఇన్ఫోసిస్‌ దక్కించుకోవడం సులభమైంది. ఇదే అంశంపై ఆస్ట్రేలియా మీడియా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ దుమ్మెత్తి పోసింది. ఎంపీ తన అధికారంతో ప్రైవేట్‌ వ్యక్తుల్ని, సంస్థల‍్ని లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించింది. 

దీంతో పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన ప్రాజెక్ట్‌పై రివ్వ్యూ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫో కాంట్రాక్ట్‌ చేజికిచ్చుకునే విషయంలో ఏమైనా అవినీతికి పాల్పడిందా? లేదా? అని కులంకషంగా పరిశీలించనుంది.   

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనుమానం
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఇచ్చిన ఈసీఈ (entitlement calculation engine) ప్రాజెక్ట్‌ విషయంలో మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తుంది. ఈసీఈ అనేది చట్టం. వ్యాపార నియమాల ఆధారంగా కస్టమర్ అర్హతలను గణిస్తుంది. ఆయా ఏజెన్సీలకు కస్టమర్‌లు చెల్లింపు లేదా సేవలు ఈ చట్టం లోబడి పని చేయాలి. ఈ విభాగానికి చెందిన ప్రాజెక్ట్‌ను ఇన్ఫోసిస్‌ దక్కించుకుంది.   

చదవండి👉 భారతీయులేనా పనిమంతులు.. మేం పనికి రామా? టీసీఎస్‌పై అమెరికన‍్ల ఆగ్రహం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top