రీల్స్, వీడియోల సంపాదనపై పన్ను | Attention Creators How to Pay Tax on Social Media Income Avoid Penalties | Sakshi
Sakshi News home page

రీల్స్, వీడియోల సంపాదనపై పన్ను

Aug 19 2026 10:04 AM | Updated on Aug 19 2026 10:04 AM

Attention Creators How to Pay Tax on Social Media Income Avoid Penalties

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో రీల్స్, వీడియోలతో ఆర్జిస్తున్న కంటెంట్ క్రియేటర్లు పన్నుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. నాన్-ఆడిట్ వర్గానికి చెందిన ఐటీఆర్‌ల సమర్పణకు ఆగస్టు 31 తుది గడువు కావడంతో ఆదాయ పన్ను శాఖ సోషల్ మీడియా సంపాదనపై దృష్టి సారించింది.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం, ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆదాయాన్ని వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే లాభాలుగా పరిగణిస్తారు. ఐటీ శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా 16021 అనే ప్రొఫెషన్ కోడ్‌ను కేటాయించింది. యాడ్‌సెన్స్, స్పాన్సర్‌షిప్‌లు, అఫిలియేట్ మార్కెటింగ్ ఆదాయాలు దీని పరిధిలోకి వస్తాయి. బ్రాండ్ల నుంచి లభించే ఉచిత స్మార్ట్‌ఫోన్లు, విదేశీ పర్యటనలు, గిఫ్ట్ వోచర్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. సెక్షన్ 194R ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో బ్రాండ్ నుంచి పొందిన ఉచిత ప్రయోజనాల విలువ రూ.20,000 దాటితే సదరు కంపెనీ 10% టీడీఎస్‌ మినహాయిస్తుంది. ఆ వస్తువును క్రియేటర్ తన వద్దే ఉంచుకుంటే దాని విలువను ఆదాయంగా చూపి పన్ను చెల్లించాలి. ఈ వివరాలన్నీ ఏఐఎస్‌/ ఫామ్‌ 26ఏఎస్‌లో నమోదవుతాయి.

మినహాయింపులు.. ఐటీఆర్ ఫారమ్

కంటెంట్ తయారీకి అయిన కెమెరా టూల్స్‌ డిప్రిసియేషన్‌, సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్లు, ఇంటర్నెట్ బిల్లులు, ఎడిటర్ల జీతాలు, స్టూడియో అద్దె వంటి ఖర్చులను మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. క్రియేటర్లు ఐటీఆర్‌-3 లేదా సులభతర పన్ను విధానం కోసం ఐటీఆర్‌-4ను ఎంచుకోవచ్చు. ఆగస్టు 31 గడువు దాటితే సెక్షన్ 234F కింద రూ.5,000 వరకు లేట్ ఫీజుతో పాటు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.20 లక్షలు దాటితే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. కాబట్టి ప్రొఫెషనల్స్ సలహాతో గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయడం శ్రేయస్కరం.

ఇది చదవండి: ఒరిజినల్‌ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement