తక్కువ ధరలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంతంటే?

ఫేమ్-II సబ్సిడీ కోత ఆందోళనల మధ్య ఎఫర్డబుల్ ధరలో
450 ఎక్స్ ధరలు పెంపు
సాక్షి, ముంబై: స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో కొత్త ఏథర్ 450ఎస్‌ను విడుదల చేసింది. ఫేమ్-II సబ్సిడీ కోతతో ఈవీల ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో ఏథర్ 450ఎస్ పేరుతో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,29,999గా నిర్ణయించింది. బుకింగ్‌లను కూడా షురూ చేసింది. (AsmiJain ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత)
తమ 450 ఎస్ IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పరిధి 115 కి.మీ. రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. గంటకు 90 కి.మీవేగంతో అత్యుత్తమ సాంకేతికత, పనితీరును అందిస్తుందని ఏథర్ఎనర్జీ కో-ఫౌండర్, సీఈవో తరుణ్ మెహతా తెలిపారు.
ఫేమ్-IIఫ్రేమ్‌వర్క్ కింద తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ 450 ఎక్స్ కొత్త ధరలను కూడా ప్రకటించింది. మునుపటి ధరతో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ. 1,65,000 (ఎక్స్-షోరూమ్ బెంగుళూరు)కి అందుబాటులో ఉంటుంది. టాప్ వేరియంట్ ప్రో ప్యాక్ ఏథర్ 450 ఎక్స్ రూ. 1.45 లక్షల నుండి రూ. 1.65 లక్షల వరకు ఉంటుంది. పాత ధరలతో పోలిస్తే దాదాపు రూ. 32,000 వరకు పెరిగింది.