ఐఫోన్‌ 13 రిలీజ్‌కి రెడీ.. ఎన్ని వెర్షన్లలో తెలుసా ?

Apple iPhone 13 Series Will Be Launch On September 14 Here Key Updates - Sakshi

Apple iPhone 13 : యాపిల్‌ గాడ్జెట్‌ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐఫోన్‌ 13 విడుదలకు తేదీ ఖరారయ్యింది. సెప్టెంబరు 14న కాలిఫోర్నియా వేదికగా ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్‌ అభిమానులు వీక్షించేలా ఈ వేడుకని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 

చక్కర్లు కొడుతున్న రూమర్స్‌
ఐఫోన్‌ 13కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌ కార్డ్‌ అవసరం లేకుండా లియో టెక్నాలజీ ఆధారంగా ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఎమర్జెన్సీ మెసేజ్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని ఇలా రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదాన్ని యాపిల్‌ సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు. 

నాలుగు వెర్షన్లలో
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ప్రతీ మోడల్‌కి సంబంధించి లైట్‌, ప్రో, ‍మినీ, మ్యాక్స్‌, ప్లస్‌ లాంటి వెర్షన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. మొదట ఒక వెర్షన్‌ విడుదలైన తర్వాత దానికి పైనా కింద అన్నట్టుగా మిగిలిన వెర్షన్లు విడుదల అవుతున్నాయి. ప్రాథమికంగా ఫోన్‌ ఒకే రకంగా ఉన్నా  ఫీచర్లలో కొన్ని తేడాల వల్ల ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే ఈ మార్కెట్‌ స్ట్రాటజీకి భిన్నంగా వెళ్లాలని యాపిల్‌ నిర్ణయించినట్టు సమాచారం. అందువల్లే ఒకేసారి ఐఫోన్‌ 13కి సంబంధించి నాలుగు వెర్షన్లు విడుదల చేయనున్నట్టు సమాచారం.

ఆ నాలుగు ఇవే
యాపిల్‌ సంస్థ నుంచి వస్తోన్న ఐఫోన్‌ 13కి సంబంధించి ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రోమ్యాక్స్‌ వెర్షన్లుగా మార్కెట్‌లోకి రాబోతున్నట్టు మొబైల్‌ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకే మోడల్‌కి సంబంధించి వరుసగా వెర్షన్స్‌ వస్తుండటంతో కొనుగోలుదారుల సైతం వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. కాబట్టి ఒకేసారి అన్ని వెర్షన్లు రిలీజ్‌ చేయడం వల్ల ఎవరికి నచ్చింది వారు సెలక్ట్‌ చేసుకుంటారనే వ్యూహంతో యాపిల్‌ ఉంది.

ధర ఎంతంటే ?
మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం అమెరికాలో కనిష్ట ధర 799 డాలర్లుగా ఉంది. అయితే భారత మార్కెట్‌కి వచ్చే సరికి స్థానిక ట్యాక్సుల ఆధారంగా ధర కొంచెం హెచ్చుగా ఉండే అవకాశం ఉంది.
వెర్షన్‌                               అమెరికా (ఇండియా)
ఐఫోన్‌ 13                       799 డాలర్లు (రూ. 58,600)
ఐఫోన్‌ 13 మినీ               699 డాలర్లు (రూ. 51,314)
ఐఫోన్‌ 13 ప్రో                 999 డాలర్లు (రూ.73,300)
ఐఫోన్‌ 13ప్రోమ్యాక్స్‌      1,099 డాలర్లు (రూ 80,679)

చదవండి: Apple: పడిపోయిన యాపిల్‌ మార్కెట్‌! భారమంతా ఐఫోన్‌ 13 పైనే?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top