12న అమెజాన్‌ స్మాల్‌ బిజినెస్‌ డే

Amazon Small Business Day On December 12 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ డిసెంబరు 12న స్మాల్‌ బిజినెస్‌ డే నిర్వహిస్తోంది. స్టార్టప్స్, మహిళా వ్యాపారులు, చేతివృత్తులు, నేతపనివారు, స్థానిక దుకాణదారులకు చెందిన ఉత్పత్తులను ఈ సందర్భంగా విక్రయిస్తారు. డిజిటల్‌ చెల్లింపులు జరిపితే 10 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ డెబిట్, క్రెడిట్‌ కార్డుతో జరిపే లావాదేవీలకు 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. స్మాల్‌ బిజినెస్‌ డే ఈ ఏడాది జరుపుకోవడం ఇది రెండవసారి. (రిలయన్స్‌ డీల్‌: అమెజాన్‌కు సమన్లు)

ఈడీకి లేఖ రాసిన సీఏఐటీ 
అమెజాన్‌పై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను కోరుతూ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) లేఖ రాసింది. ఉత్పత్తులను అతి తక్కువ ధరల్లో విక్రయిస్తూ కోట్లాది మంది చిన్న వర్తకులకు కష్టాలను తెచ్చిపెడుతోందని లేఖలో పేర్కొంది. ‘అమెజాన్‌ 2012 నుంచి నిర్లక్ష్యంగా, స్పష్టంగా చట్టాలు, నియమ, నిబంధనలను ఉల్లంఘించింది. అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్, ఇతర అనుబంధ కంపెనీలు, బినామీలు మార్కెట్‌ప్లేస్‌ ఆధారిత విధానం పేరుతో మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారం సాగిస్తున్నాయి. ఇది ఎఫ్‌డీఐ పాలసీ, ఫెమా యాక్ట్‌ను ఉల్లంఘించినట్టే’ అని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top