లేఆఫ్స్ బాంబు: టాప్‌ మేనేజర్స్‌తో సహా 20 వేల మందిపై వేటు!

Amazon layoffs now expected to mount to 20k including top managers - Sakshi

సాక్షి,ముంబై: ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌ మరోసారి భారీగా ఉద్యోగులపై వేటు వేయనుంది. ఇప్పటికే 10వేలకు పైగా సిబ్బందిని తొలగించినట్టు ప్రకటించిన అమెజాన్‌ తాజాగా టాప్‌ మేనేజర్లు సహా  20 వేల  మందికి ఉద్వాసన పలికేందుకు  రడీ అవుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో  ఎవరికి ఎపుడు ముప్పు ముంచుకొస్తుందో తెలియక ఉద్యోగులు  వణికిపోతున్నారు. 

(కాల్చి చంపేస్తారేమో..కచ్చితంగా ప్రమాదం ఉంది: ఎలాన్‌ మస్క్‌)

తాజా నివేదికల ప్రకారం రిటైల్,  క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్‌ దెబ్బ కారణంగా రానున్న నెలల్లో అమెజాన్‌ ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.  డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్లు, టెక్నాలజీ సిబ్బంది, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా రాబోయే నెలల్లో కంపెనీ అంతటా 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ యోచిస్తోంది.  ఆర్థిక మాంద్యం, ఆదాయల క్షీణత నేపథ్యంలో వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తోంది. తొల‌గించే ఉద్యోగుల‌కు 24 గంట‌ల ముందు నోటీసు జారీచేయ‌డంతో ప‌రిహార ప్యాకేజ్‌ను సెటిల్ చేయనున్నారు.

20 వేల మందిని తొలగించే ప్రయత్నంలో భాగంగా, గత కొన్ని రోజులుగా కంపెనీ మేనేజర్లు, ఉద్యోగులలో పని పనితీరు సమస్యలను గుర్తించడానికి ప్రయత్నించాలని చెప్పిందట. ఇరవై వేల మంది ఉద్యోగులు దాదాపు 6శాతం కార్పొరేట్ సిబ్బందికి సమానం. కాగా ప‌లు విభాగాల్లో ఉద్యోగుల లేఆఫ్స్‌పై అమెజాన్ సీఈవో ఆండీ జ‌స్సీ ఇటీవ‌లి సంకేతాల అందించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top