ఎయిర్ ఇండియా సీఎఫ్ఓగా 'సంజయ్ శర్మ' | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా సీఎఫ్ఓగా 'సంజయ్ శర్మ'

Published Fri, May 24 2024 8:51 PM

Air India Appoints New Sanjay Sharma As CFO

టాటా యాజమాన్యంలో ఉన్న ఎయిర్‌లైన్‌లో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన 'వినోద్ హెజ్మాడి' త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈయన పదవీ విరమణ తర్వాత జూన్ 10 నుంచి 'సంజయ్ శర్మ' తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉంటారని ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది.

సంజయ్ శర్మ.. కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్‌లో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. ఈయన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌లో సీఎఫ్ఓ, అంతకుముందు టాటా రియాల్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో సీఎఫ్ఓగా.. డ్యుయిష్ బ్యాంక్ గ్రూప్‌లో ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్, మేనేజింగ్ డైరెక్టర్ వంటి పదవులను నిర్వహించారు.

సంజయ్ మా బృందంలో చేరినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఎయిర్ ఇండియా తన పూర్వ వైభవం కోసం పరుగులు తీస్తున్న తరుణంలో సంస్థ సీఎఫ్ఓగా సంజయ్ శర్మ నియమితులు కావడం హర్సిన్చాదగ్గ విషయం అని ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ కాంప్‌బెల్ విల్సన్ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement