అమెజాన్‌లోనే కొంటున్నారా? అమ్మో జాగ్రత్త! | Ahead of Prime Day 2025 sale Over 1000 fake Amazon sites spotted | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లోనే కొంటున్నారా? అమ్మో జాగ్రత్త!

Jul 11 2025 5:43 PM | Updated on Jul 11 2025 6:14 PM

Ahead of Prime Day 2025 sale Over 1000 fake Amazon sites spotted

ప్రముఖ -కామర్స్సంస్థలో ప్రస్తుతం ప్రైమ్డే సేల్‌ 2025 నడుస్తోంది. జూలై 12-14 వరకు అమ్మకాలు జరుగుతుండగా దీనికి సంబంధించిన హడావుడి నాలుగు రోజుల ముందు హడావుడి ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 కోసం ఓ వైపు కొనుగోలుదారులు సిద్ధమవుతుండగా, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా వినియోగదారులను మోసం చేసేపనిలో పడ్డారు.

అమెజాన్లానే 1000 సైట్లు

మెరుపు డీల్స్, డిస్కౌంట్ల కోసం లక్షలాది మంది లాగిన్ అవుతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ షాపింగ్ ఉత్సుకత ఆన్లైన్ మోసాలకు తెరలేపుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, అమెజాన్ను పోలిన 1,000 కొత్త వెబ్సైట్లు 2025 జూన్లో నమోదయ్యాయి. వీటిలో 87% అనుమానాస్పదమైనవి లేదా పూర్తిగా హానికరమైనవిగా గుర్తించారు. ఈ సారూప్య డొమైన్లు చిన్న అక్షర తేడాలు లేదా ".టాప్" లేదా ".ఆన్వైన్" వంటి అసాధారణ ఎక్స్టెన్షన్లను కలిగి ఉంటాయి. ఇలా వినియోగదారులను నమ్మించి మోసగించడానికే వీటిని రూపొందించినట్లు కనిపిస్తోంది.

వినియోగదారులను మోసగించడానికి స్కామర్లు సాధారణంగా రెండు ప్రధాన ట్రిక్స్పై ఆధారపడతారు. అవి ఒకటి నకిలీ వెబ్సైట్లు, రెండోది ఫిషింగ్ ఈమెయిల్స్. అమెజాన్ చెక్అవుట్ లేదా లాగిన్ పేజీలను అనుకరించడానికి నకిలీ డొమైన్లు సృష్టిస్తున్నారు. అవి మొదటి చూసినప్పుడు అసలైన వెబ్సైట్ లాగానే అనిపిస్తాయి. దీంతో వీటి ద్వారా కొనగోళ్లకు ప్రయత్నిస్తే మొత్తానికి మోసం వస్తుంది. పాస్వర్డ్లు, ఇతర వివరాలు కూడా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది.

ఇక మరో మార్గంలో "రీఫండ్ డ్యూ" లేదా "అకౌంట్ ప్రాబ్లమ్" వంటి విషయాలతో ఫిషింగ్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ సందేశాలు మామూలుగా అమెజాన్ సపోర్ట్ టీమ్ నుండే వచ్చినట్లు అనిపిస్తాయి. అక్కడ కనిపించిన లింక్లను క్లిక్ చేస్తే స్కామ్ వెబ్సైట్లకు దారితీసే అవకాశం ఉంది. ప్రైమ్ డే సందర్భంగా కొనుగోలుదారులు హడావుడిగా ఉంటారని సైబర్ నేరగాళ్లకు తెలుసు. వారు మీ అత్యవసరతను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు.

కొన్ని జాగ్రత్తలు

  • సురక్షితంగా ఉండటానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఇవి సాధారణమైనవే కానీ శక్తివంతమైనవి. అవి..

  • అధికారిక అమెజాన్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే షాపింగ్చేయండి

  • మీ ఖాతాను అప్డేట్ చేయమని లేదా రీఫండ్ క్లెయిమ్ చేయమని కోరే ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.

  • ఆకర్షణీయంగా అనిపించే ఫ్లాష్ డీల్స్ జోలికి పోవద్దు.

  • టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.

  • మీ సాఫ్ట్వేర్, బ్రౌజర్లను అప్డేట్ చేసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement