breaking news
Prime Day
-
అమెజాన్లోనే కొంటున్నారా? అమ్మో జాగ్రత్త!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ 2025 నడుస్తోంది. జూలై 12-14 వరకు అమ్మకాలు జరుగుతుండగా దీనికి సంబంధించిన హడావుడి నాలుగు రోజుల ముందు హడావుడి ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 కోసం ఓ వైపు కొనుగోలుదారులు సిద్ధమవుతుండగా, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా వినియోగదారులను మోసం చేసేపనిలో పడ్డారు.అమెజాన్ లానే 1000 సైట్లుమెరుపు డీల్స్, డిస్కౌంట్ల కోసం లక్షలాది మంది లాగిన్ అవుతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ షాపింగ్ ఉత్సుకత ఆన్లైన్ మోసాలకు తెరలేపుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, అమెజాన్‌ను పోలిన 1,000 కొత్త వెబ్సైట్లు 2025 జూన్‌లో నమోదయ్యాయి. వీటిలో 87% అనుమానాస్పదమైనవి లేదా పూర్తిగా హానికరమైనవిగా గుర్తించారు. ఈ సారూప్య డొమైన్లు చిన్న అక్షర తేడాలు లేదా ".టాప్" లేదా ".ఆన్వైన్" వంటి అసాధారణ ఎక్స్టెన్షన్లను కలిగి ఉంటాయి. ఇలా వినియోగదారులను నమ్మించి మోసగించడానికే వీటిని రూపొందించినట్లు కనిపిస్తోంది.వినియోగదారులను మోసగించడానికి స్కామర్లు సాధారణంగా రెండు ప్రధాన ట్రిక్స్పై ఆధారపడతారు. అవి ఒకటి నకిలీ వెబ్సైట్లు, రెండోది ఫిషింగ్ ఈమెయిల్స్. అమెజాన్ చెక్అవుట్ లేదా లాగిన్ పేజీలను అనుకరించడానికి నకిలీ డొమైన్లు సృష్టిస్తున్నారు. అవి మొదటి చూసినప్పుడు అసలైన వెబ్సైట్ల లాగానే అనిపిస్తాయి. దీంతో వీటి ద్వారా కొనగోళ్లకు ప్రయత్నిస్తే మొత్తానికి మోసం వస్తుంది. పాస్వర్డ్లు, ఇతర వివరాలు కూడా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది.ఇక మరో మార్గంలో "రీఫండ్ డ్యూ" లేదా "అకౌంట్ ప్రాబ్లమ్" వంటి విషయాలతో ఫిషింగ్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ సందేశాలు మామూలుగా అమెజాన్ సపోర్ట్ టీమ్ నుండే వచ్చినట్లు అనిపిస్తాయి. అక్కడ కనిపించిన లింక్‌లను క్లిక్ చేస్తే స్కామ్ వెబ్సైట్లకు దారితీసే అవకాశం ఉంది. ప్రైమ్ డే సందర్భంగా కొనుగోలుదారులు హడావుడిగా ఉంటారని సైబర్ నేరగాళ్లకు తెలుసు. వారు మీ అత్యవసరతను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు.కొన్ని జాగ్రత్తలుసురక్షితంగా ఉండటానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఇవి సాధారణమైనవే కానీ శక్తివంతమైనవి. అవి..అధికారిక అమెజాన్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే షాపింగ్ చేయండిమీ ఖాతాను అప్డేట్ చేయమని లేదా రీఫండ్ క్లెయిమ్ చేయమని కోరే ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.ఆకర్షణీయంగా అనిపించే ఫ్లాష్ డీల్స్ జోలికి పోవద్దు.టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.మీ సాఫ్ట్వేర్, బ్రౌజర్లను అప్డేట్ చేసుకోండి. -
‘ప్రైమ్‌డే’లో 2,400 ఉత్పత్తుల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై 26–27 తేదీల్లో నిర్వహించే ’ప్రైమ్ డే’లో 100 పైచిలుకు చిన్న, మధ్య తరహా సంస్థలు 2,400 పైచిలుకు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ ప్రణవ్ భాసిన్ తెలిపారు. ఈ సంస్థల్లో స్టార్టప్‌లు, మహిళా ఎంటర్ప్రెన్యూర్లు, చేనేత కళాకారులు మొదలైన వారు ఉంటారని పేర్కొన్నారు. ఇల్లు..వంటగదికి అవసరమైన ఉత్పత్తులు మొదలుకుని ఫ్యాషన్, ఆభరణాలు, స్టేషనరీ, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులు ఉంటాయని భాసిన్ వివరించారు. ప్రైమ్ డేలో 450 నగరాల నుంచి 75,000 పైచిలుకు ’లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ విక్రేతలు పాల్కొంటారని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం గతేడాది లాక్డౌన్లు విధించినప్పట్నుంచీ ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లో తమ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని భాసిన్ చెప్పారు. ప్రస్తుతం తమ కస్టమర్ ఆర్డర్లలో 65 శాతం, కొత్త కస్టమర్లలో 85 శాతం మంది వీరే ఉంటున్నారన్నారు. వర్క్–ఫ్రం–హోమ్, ఆన్లైన్ స్కూలింగ్‌కు సంబంధించిన ఉత్పత్తులతో పాటు వ్యక్తిగత సౌందర్య సాధనాలు, నిత్యావసరాలు మొదలైన వాటికి డిమాండ్ ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్: మొబైల్ ఆఫర్ల ప్రోమో రిలీజ్ చేసిన అమెజాన్..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. మొదట ఈ సేల్‌ను జూన్ నెలలో నిర్వహించాలని భావించినా, కోవిడ్ కారణంగా ప్రైమ్ డే సేల్ వాయిదా పడింది. కోవిడ్-19 కారణంగా నష్టపోయిన వ్యాపారులకు ప్రైమ్ డే సేల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో డిస్కౌంట్ వచ్చే స్మార్ట్ఫోన్ల జాబితాను అమెజాన్ విడుదల చేసింది. డిస్కౌంట్ ధరలతో లభించే వన్‌ప్లస్ నార్డ్ సిఇ 5 జి, రెడ్మి నోట్ 10 ఎస్, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్, ఐఫోన్ 11 వన్‌ప్లస్ 9 ఆర్ 5 జి, రెడ్మి నోట్ 10 ఫోన్లను అమెజాన్ ప్రకటించింది. ఐఫోన్ 12 ప్రో, శామ్సంగ్ నోట్ 20, ఎంఐ 11 ఎక్స్ 5 జి, ఎంఐ 10 ఐ 5 జి, ఐక్యూ 7 లెజెండ్ వంటి ఫోన్లపై కూడా డిస్కౌంట్లను ప్రకటించనుంది. ఈ మొబైళ్ల ధరలను అమెజాన్ పూర్తిగా వెల్లడించలేదు. ప్రైమ్ డే సేల్‌లో సుమారు 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొబైళ్లపై డిస్కౌంట్ ఆఫర్లను సేల్కు రెండురోజుల ముందు ప్రైమ్ మెంబర్స్‌కు అందుబాటులో ఉంచనుంది -
అమెజాన్ ప్రైమ్ డే సేల్ : భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై : ఈ కామర్స్ సంస్థల్లో ప్రత్యేక అమ్మకాల సందడి మొదలైంది. ముఖ్యంగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను ప్రారంభించింది. నేటి (ఆగస్టు 6) నుంచి కేవలం 48 గంటల పాటు మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ఫోన్లు, యాక్ససరీలు, కిండిల్, ఫైర్ టీవీ స్టిక్స్, ఎల్ఈడీ టీవీలు తదితర అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ట్యాబ్లెట్ పీసీలపై 43 శాతం తగ్గింపు ధరలను అందిస్తోది. టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్. స్మార్ట్బ్యాండ్లు, ఆపిల్ వాచ్‌లను కూడా తగ్గింపు ధరలకు కొనవచ్చు. హెచ్డీఎఫ్సీ కార్డు కోనుగోళ్లపై అదనంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్లు మాత్రమే ఈసేల్ లో పాల్గొనే అవకాశం. స్మార్ట్ ఫోన్లపై కొన్ని ఆకర్షణీయ డీల్స్ ఐఫోన్ 11.. 68,300 రూపాయలు అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 8జీబీ ర్యామ్128 జీబీ వేరియెంట్.. 44,999 రూపాయలకు లభ్యం. అసలు ధర 71 వేలు వన్‌ప్లస్ 8 ప్రో 54,999 రూపాయల నుంచి అందుబాటులో ఆపిల్ ఐఫోన్ 11 64జీబీ వేరియెంట్ 8,400 రూపాయల తగ్గింపుతో 59,900 లకే లభ్యం శాంసంగ్ గెలాక్సీ ఎస్10 ప్లస్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 52,999 రూపాయలు. 12,201 ప్రత్యేక తగ్గింపు వన్‌ప్లస్ 7టీ ప్రొ 8 జీబీర్యామ్ , 256జీబీ వేరియెంట్ పై 4వేల తగ్గింపుతో 43,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ వేరియెంట్ 39,900 ధరకు లభిస్తుండగా, వివో వి19 8 జీబీ, 128 జీబీ ఫోన్ రూ.24,990 ధరకు లభిస్తున్నాయి. అలాగే రెడ్మీ కె20 ప్రొ 6జీబీ, 128జీబీ ఫోన్ రూ.22,999 ధరకు, వివో వి17 8జీబీ, 128జీబీ వేరియెంట్ రూ.21,990 ధరకు, శాంసంగ్ గెలాక్సీ ఎం31 రూ.16,499కు లభిస్తున్నాయి. -
ప్రైమ్ డే సేల్ : అమెజాన్‌కు షాక్
శాన్ఫ్రాన్సిస్కో : అమెరికా రిటైల్ దిగ్గజం అమెజాన్‌కు భారీ షాక్ తగిలింది. వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ప్రతిష్టాత్మక ప్రైమ్ డే సేల్‌ను ఇలామొదలుపెట్టిందో లేదో అలా అమెజాన్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పని పరిస్థితులు, వేతనాలు తదితర అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ వేలాది మంది ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా రోడ్డెక్కారు. తమ పని పరిస్తితులు మెరుగుపర్చాలని, పర్యావరణ హితంగా పనిచేయాలని, అమెరికన్ ఇమ్మిగ్రేషన అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)తో సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ప్లకార్డులను ప్రదర్శించారు. ముఖ్యంగా శాన్ఫ్రాన్సిస్కో , సియాటెల్, మిన్నెసోటాలోని షాకోపీ అమెజాన్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారని టెక్ క్రంచ్ నివేదించింది. అమెరికా సహా యూరోప్‌లోని పలు నగరాల్లో ఉద్యోగుల నిరసన వెల్లువెత్తిందిని రిపోర్ట్ చేసింది. అంతేకాదు పలు నగరాల్లో తమ నిరసన కొనసాగించాలని ప్లాన్ చేశారని తెలిపింది. 1 ట్రిలియన్ డాలర్లుగా పైగా సంపదతో అలరారుతున్న అమెజాన్‌లోని ఉద్యోగులు తమకు సరియైన వేతనాలు లభించడంలేదనీ, కనీసం బాత్రూం విరామం(చాలా తక్కువ) కూడా ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారని న్యూస్‌వీక్ నివేదిక తెలిపింది. అంతేకాదు కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరుతో రెండు లక్షల 70వేల మంది సంతకాలతో ఒక పిటిషన్‌ను అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు ఇంటికి పంపించనున్నారట. -
టాప్‌లో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ గత వారం నిర్వహించిన ప్రైమ్ డే విక్రయాల్లో ఫైర్ టీవీ స్టిక్ ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో నిలిచింది. భారత్‌లో టాప్–3 ఉత్పాదనల్లో స్థానం సంపాదించినట్టు కంపెనీ వెల్లడించింది. ప్రైమ్ కస్టమర్ల కోసం దేశంలో తొలిసారిగా ప్రైమ్ డే అమ్మకాలను జూలై 10, 11న నిర్వహించారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రైమ్ డే సందర్భంగా సేల్స్ మూడు రెట్లను దాటాయి. స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్లలో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ప్రపంచంలో లీడర్‌గా నిలుస్తున్నట్లు కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ అభిషేక్ కౌశిక్ తెలిపారు. పీఆర్ మేనేజర్ రాఘవేంద్ర రమేశ్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రూ.3,999 ధరలో మరే ఇతర కంపెనీ పోటీపడటం లేదని చెప్పారు. ‘3,000 పైగా యాప్స్ నిక్షిప్తమై ఉన్నాయి. వైఫైతో పనిచేసే ఈ స్టిక్‌ను టీవీకి అనుసంధానిస్తే చాలు. యాప్స్, సినిమాలు, క్రీడలు, టీవీ షోల వంటి కంటెంట్ ప్రత్యక్షమవుతుంది. యాప్ సహాయంతో లైవ్ టీవీ చూడొచ్చు. ఎక్స్‌క్లూజివ్ సినిమాలు, టీవీ షోలూ ఉన్నాయి. భారత్ కోసం భారత్‌లో నిర్మించిన ప్రత్యేక షోలు అందుబాటులోకి తీసుకొచ్చాం. రిమోట్‌ను దగ్గరగా పెట్టుకుని వాయిస్ కమాండ్ ఇచ్చినా చాలు. డేటా తక్కువ వినియోగం అయ్యేందుకు వీలుగా సాంకేతికంగా ఏర్పాట్లు ఉన్నాయి’ అని వివరించారు.