అదానీ, అవన్ని వదంతులేనా? ఆ టీవీని అమ్మడం లేదట! | Adani Will Take Over NDTV Is A Just Rumor Clarified By Founders | Sakshi
Sakshi News home page

అదానీ, అవన్ని వదంతులేనా? ఆ టీవీని అమ్మడం లేదట!

Sep 22 2021 3:34 PM | Updated on Sep 22 2021 3:45 PM

Adani Will Take Over NDTV Is A Just Rumor Clarified By Founders - Sakshi

ఎన్డీటీవీని గౌతమ్‌ అదాని కొనుగోలు చేయబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చింది

Gautham Adani And NDTV Issue: తమ టీవీ ఛానల్‌ యాజమాన్య మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిరాధరామైనవని ఎన్డీటీవీ ప్రకటించింది. ఎన్డీటీవీ అమ్మకానికి సంబంధించి ప్రస్తుతం కానీ, గతంలో కానీ ఎవరితో చర్చలు జరగలేదని ఆ టీవీ ఛానల్‌ ఫౌండర్లు, మేజర్‌ షేర్‌ హోల్డర్లయిన ప్రణయ్‌రాయ్‌, రాధికలు ప్రకటించారు.

రిలయన్స్‌కి పోటీగా
పోర్టుల బిజినెస్‌లో దూసుకుపోతున్న అదాని గ్రూపు ఇటీవలే గ్రీన్‌ ఎనర్జీ రంగంలోనూ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. గ్రీన్‌ ఎనర్జీలో భారీ లక్ష్యాలను రిలయన్స్‌ గ్రూపు ప్రకటించిన కొద్ది రోజులకే అదానీ గ్రూపు నుంచి గ్రీన్‌ ఎనర్జీ ప్రకటన వెలువడింది. తాజాగా అదే పరంపరలో రిలయన్స్‌ తరహాలోనే బిజినెస్‌ టైకూన్‌ గౌతమ్‌ అదానీ మీడియా రంగంలో అడుగు పెడుతున్నారంటూ గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి.

తెరపైకి సీనియర్‌ జర్నలిస్ట్‌ 
ఇటు బిజినెస్‌, అటు పొలిటికల్‌ సర్కిళ్లలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టే పలు మీడియా సంస్థల్లో ఉన్నత హోదాలో పని చేసిన సీనియర్‌ జర్నలిస్టు సంజయ్‌ పుగాలియా ఇటీవల అదానీ గ్రూపులో చేరారు. దీంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది.

పెరిగిన  షేర్ల ధర
మీడియా రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్న గౌతమ్‌ అదానీ ఎన్డీటీవీని కొనబోతున్నట్టు బిజినెస్‌ సర్కిళ్లలో ప్రచారం జరిగింది. రెండు రోజుల్లోనే ఈ ప్రచారం ఊపందుకోవడంతో ఒక్కసారిగా షేర్‌ మార్కెట్‌లో ఎన్డీటీవీ షేర్లు పది శాతం మేర పెరిగాయి.

అంతా వదంతులే
ప్రభుత్వం విధానాల్లో లోపాలను ఎత్తి చూపడంతో ఎన్డీటీవీది ప్రత్యేక శైలి. అలాంటి ఛానల్‌ యాజమాన్య మార్పులకు లోనవుతుందంటూ జరుగుతున్న ప్రచారం పెరిగిపోవడంతో ఆ టీవీ ఫౌండర్లు స్పందించారు. తమ ఛానల్‌ అమ్మడం లేదంటూ క్లారిటీ ఇవ్వడంతో పాటు... పుకార్లను కొట్టి పారేశారు. 
చదవండి : హైడ్రోజన్‌ ఉత్పత్తిలోకి అదానీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement