ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్‌: ఈ ఏడాది ముగ్గురికి పురస్కారం | Sakshi
Sakshi News home page

ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్‌: ఈ ఏడాది ముగ్గురికి పురస్కారం

Published Mon, Oct 10 2022 4:11 PM

3 Share Economics Nobel For Research On Banks Financial Crises - Sakshi

స్టాక్‌హోమ్‌: ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్‌ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్‌విగ్‌లకు  సోమవారం నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాల‌పై ఈ ముగ్గురి ప‌రిశోధ‌న‌లకు గాను రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్ర‌క‌టించింది.

ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో, అలాగే ఆర్థిక మార్కెట్‌లను ఎలా నియంత్రించాలనే దానిపై  అవగాహనను గణనీయంగా మెరుగుపరిచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ పేర్కొంది. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్య‌మైంద‌న్న విష‌యాన్ని ఈ ముగ్గురూ త‌మ ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డించారు..బ్యాంకులు దివాళా తీయ‌కుండా ఉండేందుకు ఈ స్ట‌డీ చాలా కీల‌క‌మైంద‌ని పేర్కొంది.

Advertisement
Advertisement