ప్రసాదాల ధర పెంపు ఇలా..
సర్క్యులర్ విడుదల
చేసిన ఈఓ
టికెట్ల పెంపు ప్రతిపాదనలు ఇలా ఉన్నట్లు సమాచారం
భద్రాచలం రామాలయంలో ప్రసాదాల ధరల పెంపు ఐదు రకాల ప్రసాదాల రేటును సవరించిన అధికారులు ముక్కోటి టికెట్ల ధరలు కూడా పెంచాలని నిర్ణయం
భద్రాచలం: అందరి బంధువుగా ఆరాధించే భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఖర్చుల భారం పెరుగుతోంది. దేవస్థానం విక్రయించే ప్రసాదాల ధరలకూ రెక్కలొచ్చాయి. చిన్న లడ్డూ నుంచి మహాలడ్డూ వరకు ఐదు రకాల ప్రసాదాల ధరలను సవరించారు. డిసెంబర్ 20న జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల టికెట్ల ధర కూడా పెంచాలనే ప్రయత్నాల్లో అధికా రులు ఉన్నారు. ఇదే జరిగితే ముక్కోటికి వచ్చే భక్తులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
ముక్కోటి టికెట్ల రేటు కూడా..
డిసెంబర్ 20న భద్రాచలంలో వైభవంగా నిర్వహించే ముక్కోటి ఉత్సవాల దర్శన టికెట్ల ధరలను కూడా పెంచాలనే దేవస్థాన అధికారులు నిర్ణయించారు. మరో వారం రోజుల్లో పెంపును ఖరారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయాలకు ఉంచనున్నట్లు సమాచారం. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాద్రికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముక్కో టి ఏకాదశి వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఈ సమయంలో ప్రసాదాల ధరలతోపాటు టికెట్ ధరలు ఒకేసారి పెరిగితే కుటుంబ సమేతంగా వచ్చే భక్తులపై ఖర్చుల భారం అయ్యే అవకాశం ఉంది. కాగా, ముక్కోటికి, నవమికి సుమారు లక్ష లడ్డూలను విక్రయిస్తుంటారు.
ప్రసాదం పరిమాణం పాత ధర పెంచిన ధర
(గ్రాముల్లో) (రూ.లలో) (రూ.లలో)
చిన్న లడ్డూ 100 25 30
మహాలడ్డూ 400 100 125
పులిహోర 200 15 20
చక్కెర పొంగలి 100 15 20
బెల్లం రవ్వకేసరి 100 20 25
ఇటీవల నెయ్యి ధరలను పెంచటంతో స్వామివారి ప్రసాదాల రేట్లను పెంచుతూ ఈఓ దామోదర్‌రావు సర్క్యులర్ విడుదల చేశారు. ప్రసాదాల ధరల సవరణకు సంబంధించి దేవస్థానం అధికారులు భక్తుల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఆహ్వానించారు. 15 రోజుల్లోగా దేవస్థానం కార్యాలయానికి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. నిర్ణీత గడువులో వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.
సెక్టార్ పాత ధర ప్రస్తుత ధర టికెట్లు
(రూ.లలో) (రూ.లలో)
వీవీఐపీ 2,000 3,000 250
వీఐపీ ––– ––– 1,250
ఏ సెక్టార్ 1,000 1,500 350
బీ సెక్టార్ 500 500 850
సీ సెక్టార్ 500 1,000 350
డీ సెక్టార్ 500 500 200
ఈ సెక్టార్ 250 250 650
మీడియా ––– ––– 150
మొత్తం 4,050


