కల్యాణం కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం కమనీయం

Nov 29 2026 2:05 PM | Updated on Nov 29 2026 2:05 PM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారినిత్యకల్యా ణం కమనీయంగా సాగింది. తెల్లవారుజాము నే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు నిర్వహించా రు. అనంతరం మిథిలా స్టేడియం ప్రాంగణంలోని శ్రీరామా సేవామండపంలో ఉత్సవ మూర్తులకు కొలువుదీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్య కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.

ఖేలో ఇండియా క్రీడల్లో గుర్తింపు తేవాలి

కలెక్టర్‌ అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): డిసెంబర్‌ 11 నుంచి 22వ తేదీవరకు ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా క్రీడా సంబరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడా సంబరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 7వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారని, 27రకాల క్రీడాంశాల్లో 33 జిల్లాలు, 6నగరాలు, 20వేదికల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతిభ కలిగి న క్రీడాకారులు పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటా లని కోరారు. ఖేలోఇండియా యూత్‌ గేమ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కాగా, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు హాజరయ్యారు.

ప్రశాంతంగా

నవోదయ ప్రవేశ పరీక్ష

కొత్తగూడెంఅర్బన్‌: జవహర్‌ నవోదయ విద్యాలయ పాఠశాలలో 2027–28 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 1,657 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1443మంది హాజరయ్యారు. 214 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.శంభూప్రసాద్‌, జవహ ర్‌ నవోదయ విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ మోహన్‌రాథోడ్‌ తెలిపారు. పరీక్ష సజావుగా జరిగిందని పేర్కొన్నారు.

ఉద్యాన విద్యలో ప్రవేశాలకు మరో అవకాశం

అశ్వారావుపేటరూరల్‌: ఉద్యాన కళాశాలలో ప్రవేశాలకు మరో అవకాశం కల్పించినట్లు కళా శాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ మజ్జిగ శ్రీని వాస్‌ తెలిపారు. శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. ఉద్యాన కళాశాలలో మిగిలి ఉన్న 19 సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌లో బైపీసీ కోర్సు పూర్తి, టీజీ ఈఏపీసెల్‌–2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

‘ఫిట్‌ కాప్‌’ యాప్‌పై పోలీసులకు శిక్షణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పోలీసు ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం, హె ల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ రూపొందించిన ఫిట్‌ కాప్‌ యాప్‌ వినియోగంపై పోలీసులకు శనివా రం శిక్షణ ఇచ్చారు. కొత్తగూడెంలోని హెడ్‌ క్వా ర్టర్స్‌లో జరిగిన సమావేశంలో యాప్‌లో ఆరో గ్య వివరాల నమోదు, మధుమేహం, బీపీ వివరాల పరిశీలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి మాట్లాడుతూ యాప్‌ ద్వారా పోలీసులు ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవచ్చ న్నారు. ఇన్‌స్పెక్టర్లు రాము, రమాకాంత్‌, ఇంద్రసేనారెడ్డి, నాగబాబు, ఎల్లయ్య, కరుణాకర్‌, సురేష్‌, నరేష్‌, నర్సింహారావు, లాల్‌బాబు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

సత్ప్రవర్తనతో మెలగాలి

ఇల్లెందు: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని, జైలు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, న్యాయమూర్తి డాక్టర్‌ స్వరూప కాటం సూచించారు. పట్టణంలోని సబ్‌జైలును శని వారం తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలు, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. ఖైదీ లకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. జైలు అధికారులు, ఉదయ్‌ కుమార్‌, భుజంగరాజు, సాంబ, భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement