పాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో సత్తా చాటాలని ఐటీడీఏ ఏసీఎంఓ రమేష్ అన్నారు. మండల పరిధిలోని కిన్నెరసాని క్రీడా పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థుల జోనల్‌స్థాయి క్రీడా ఎంపికలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సాధన చేస్తే సాధించలేనిది ఏదిలేదని అన్నారు.
248 మంది ఎంపిక
కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నీకాయిట్, చదరంగం, అథ్లెటిక్స్, ఆర్చరీ క్రీడా పోటీల్లో ఏడు డివిజన్లకు చెందిన 950 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్–17 విభాగంలో 124 మంది, అండర్–14 విభాగంలో 124 మంది మొత్తం 248 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్‌రావు తెలిపారు.
ఐటీడీఏ ఏసీఎంఓ రమేష్


