క్రీడల్లోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లోనూ రాణించాలి

Nov 29 2026 2:05 PM | Updated on Nov 29 2026 2:05 PM

పాల్వంచ: ఉద్యోగులు విధులతోపాటు క్రీడల్లోనూ రాణించాలని టీజీ జెన్‌కో డైరెక్టర్‌ వి.కుమార్‌ రాజు అన్నారు. విద్యుత్‌ కళాభారతి క్రీడా మైదానంలో కేటీపీఎస్‌ 5,6 దశల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న జెన్‌కో ఇంటర్‌ ప్రాజెక్ట్స్‌ ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌ క్రీడా పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ పోటీల్లో కేటీపీఎస్‌ 5,6,7 దశలు, విద్యుత్‌ సౌధ, వైటీపీఎస్‌, పులిచింతల, జూరా ల ప్రాజెక్ట్‌ల జట్లు పాల్గొన్నాయి. తొలుత డీఏవీ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్‌ ఆకట్టుకుంది. అనంతరం డైరెక్టర్‌ మాట్లాడుతూ యాజమాన్యం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఆ తర్వాత జెన్‌కో ట్రైనింగ్‌ సెంటర్‌లో జరుగుతున్న ఇంజనీర్ల శిక్షణ తరగతులను పరిశీ లించారు. విద్యుత్‌ ఉద్యోగులు మారుతున్న సాంకేతికతను అందిపుచ్చువాలని సూచించారు. సీఈలు ఎం.ప్రభాకర్‌ రావు, బి.పార్వతి, స్పోర్ట్స్‌ అధికారులు లోహిత్‌ ఆనంద్‌, వీరస్వామి, వెంకటేశ్వర రావు, రామారావు పాల్గొన్నారు.

డైరెక్టర్‌కు వినతుల వెల్లువ

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జెన్‌కో గెస్ట్‌హౌస్‌లో పలువురు వినతిపత్రాలు అందజేశారు. సంస్థలో ఖాళీగా ఉన్న 300 ఏఈ పోస్టులను భర్తీచేయాలని, ఇంజనీర్లను బదిలీచేయాలని, పెండింగ్‌ పీఆర్‌సీ అందించాలని, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, టీజీవోవోను విడుదల చేయాలని, బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌లను భర్తీ చేయాలని వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విన్నవించారు. ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ బ్రాంచ్‌ సెక్రటరీ లు ఉమా మహేశ్వరరావు, యాస్మీన్‌, హెచ్‌–82 నాయకులు ఆవుల కృష్ణారెడ్డి, వెంపటి అనిల్‌కుమార్‌, మాల విద్యుత్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బూర్గుల విజయభాస్కర్‌, 327 యూనియన్‌ నాయకులు అబ్దుల్‌ మజీద్‌, డోలి శ్రీనివాసరావు, టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర నాయకులు చారుగుండ్ల రమేష్‌, ముత్యాల రాంబాబు పాల్గొన్నారు.

జెన్‌కో డైరెక్టర్‌ కుమార్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement