భద్రాచలంఅర్బన్: గోదావరి పుష్కరాలనేపథ్యంలో భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లోని పలు ప్రాంతాలను ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్‌శ్రేష్ఠ శనివారం పరిశీలించారు. నీటిపారుదల, అటవీశాఖ అధికారులతో కలిసి భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, భక్తులను తాత్కాలికంగా నిలిపేందుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు అనుసరించాల్సిన ప్రణాళికపై ఆయా శాఖల అధికా రులతో చర్చించారు. కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, సీఐ ఎస్. రాజు, ఎస్సైలు మేడా ప్రసాద్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశించారు. శనివారం భద్రాచలం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. తొలుత సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులు, ప్రభుత్వ సామగ్రిని పరిశీలించారు. సిబ్బంది విధుల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ మా ట్లాడుతూ భద్రాచలంలో భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధా న కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్, ఆలయ పరిసరాల్లో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అరుణ్‌కుమార్, సీఐ ఎస్.రాజు, ట్రాఫిక్ ఎస్‌ఐ కేశవ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
స్వామివారి సేవలో ఎస్పీ
భద్రాచలం: ఎస్పీ రోహిత్ రాజు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. పండితులు వేదాశీర్వచనం చేయగా, ఈఓ దామోదర్‌రావు ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. దేవస్థానం ఏఈఓ శ్రవణ్‌కుమార్, పర్యవేక్షకుడు లింగాల సాయిబాబా, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకుడు అమరవాది విజయరాఘవన్ పాల్గొన్నారు.


