కొత్తగూడెంఅర్బన్: సికింద్రాబాద్‌లో ఈనెల 28, 29వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి ఈత పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. రుద్రంపూర్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో సోమవారం నిర్వహించిన పోటీల్లో జట్టును ఎంపిక చేశామని స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి హన్మంతరావు తెలి పారు. ఈమేరకు వివిధ విభాగాల్లో పి.వరప్రసాద్, జె.అజయ్, ఎం.హరీష్, ఎస్.డీ.జాసిమ్, ఎస్.కే. తాహిర్ హుస్సేన్, సీ.హెచ్.మోక్ష చంద్రశేఖరరావు, ఆర్.ప్రతీక్ సింగ్, భగవత్, వి.మనీష్, ఎం.తోషన్‌కుమార్, కె.హేమంత్, బి.ధ్రువతేజ్, సీ.హెచ్. శ్రీదయ, ఎం.అదీప్త్, దీప్య సాయి, కృష్ణవేణి, కృతిక, లక్ష్మీహయాతి ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు, కోచ్‌లు మురిసెట్టి లక్ష్మీనరసింహ, డి.రాజు, ఆర్.నరహరి, సామ్యేల్, శామంత్, సంధ్యారాణి, రాంబాబు అభినందించారు.


