ఇంటర్‌ సర్కిల్‌ కబడ్డీ, టెన్నిస్‌ టోర్నీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సర్కిల్‌ కబడ్డీ, టెన్నిస్‌ టోర్నీ ప్రారంభం

Nov 24 2026 12:18 AM | Updated on Nov 24 2026 12:18 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: విద్యుత్‌ శాఖ ఉద్యోగుల కబడ్డీ, టెన్నిస్‌ పోటీలు సోమవారం ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ట్రాన్స్‌కో, తెలంగాణ డిస్కంల ఆధ్వర్యాన ఇంటర్‌ సర్కిల్‌ పరిధి జట్లు పాల్గొంటున్న ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయి. పోటీలను వరంగల్‌ టెలికాం ఎస్‌ఈ ఎం.శ్రీనివాస్‌ ప్రారంభించగా స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఓఎంసీ ప్రెసిడెంట్‌ వీ.వీ.కష్ణారావు, వరంగల్‌ ఎస్‌ఈ టీ.వీ.రావు, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ఎన్‌.జగన్నాధ్‌, ఖమ్మం ఏడీ బి.బాబునాయక్‌ మాట్లాడారు. నిత్యం విధినిర్వహణలో ఒత్తిడి ఎదుర్కొనే ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ సొంతమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్‌బాబు, డీఈ ఎస్‌.అంజయ్య, ఈఈ ఎస్‌.సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా, తొలిరోజు కబడ్డీ పోటీల్లో ఖమ్మం ట్రాన్స్‌కో, వరంగల్‌ ఆపరేషన్‌ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరాయి. టెన్నిస్‌ పోటీలు లీగ్‌ దశలో కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement