శ్రీ చండీ దేవిగా పెద్దమ్మతల్లి అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

శ్రీ చండీ దేవిగా పెద్దమ్మతల్లి అమ్మవారు

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

పాల్వంచరూరల్‌: శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పెద్దమ్మతల్లి అమ్మవారు బుధవారం శ్రీచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శ్రీ శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరాయి. అర్చకులు అమ్మవారికి ప్రాతః కాలార్చన, శ్రీలక్ష్మీగణపతి అనుష్టానం, వేధపారాయణం, నవగ్రహ జపం, శ్రీచక్రార్చన, మహన్యానపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం లక్ష్మీనారాయణ కల్యాణం(అశ్వద్దనారాయణ కళ్యాణం), చండీహోమం, లక్ష కుంకుమార్చన, నాదనీరాజనం, మంత్రపుష్ప పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement