కొత్తగూడెంఅర్బన్/సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా కోర్టులో బుధవారం ఘనంగా బతకమ్మ వేడుకలు నిర్వహించారు. వేడుకలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత గౌరమ్మ పూజ చేసి ప్రారంభించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, కో ఆపరేటివ్ శాఖలు, పీఏసీఎస్, బ్యాంకుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమాల్లో న్యాయమూర్తులు రాజేందర్, రవికుమార్, వినయ్ కుమార్, న్యాయవాదుల సంఘం ప్రెసిడెంట్ కిరణ్కుమార్, జనరల్ సెక్రటరీ మహేష్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.


