భద్రాచలం: గిరిజన యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ట్రైకార్, గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండో విడత శిక్షణ వాల్పోస్టర్లను ఐటీడీఏ పీఓ బి.రాహుల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సంక్షేమ పథకాలు అందేలా చర్యలు
తీసుకోవాలి
ఆదివాసీ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సూచనల మేరకు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు అమలు చేస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ఏపీఓ డేవిడ్ రాజ్, డీడీ చందన, జేడీఎం హరికృష్ణ, వైటీసీ మేనేజర్ నక్క శ్రీను, పీవీటీజీ అధికారి గన్యా, ఈఈ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


