పాల్వంచరూరల్: దసరా పండుగ వేళ మద్యం ధరలు పెరిగాయి. విదేశీ మద్యంతోపాటు ఫుల్ బాటిల్ రూ.2 వేల పైన ధర ఉన్న మద్యం ధర పెంచారు. అబ్సల్యూట్ సిట్రాన్ ఫుల్ బాటిల్ రూ.2600 ఉండగా, రూ.2770కు పెంచారు. బాటిల్పై రూ.170 పెరిగింది. అబ్సల్యూట్ లైమ్ రూ.2560 ఉండగా, రూ. 200 పెంచి రూ.2760కు విక్రయించనున్నారు. వీటితోపాటు మరికొన్ని బ్రాండ్ బాటిళ్ల ధర కూడా పెరిగింది. కాగా, పెరిగిన ధరలపై ఉన్నతాధికారుల నుంచి తమకు ఉత్తర్వులు ఇంకా అందలేదని, జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
కేటీపీఎస్లో పర్యటించిన జెన్కో డైరెక్టర్
పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో టీజీ జెన్కో సివిల్ డైరెక్టర్ అజయ్ బుధవారం పర్యటించారు. యాష్ పాండ్ అభివృద్ధి, క్రషర్ హౌస్, కోల్ ప్లాంట్, ఉద్యోగుల నూతన క్వార్టర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహా ఆవిష్కరణ పనులపై పలు సూచనలు చేశారు. అనంతరం అమ్మవారి మండపంలో పూజలు నిర్వహించారు. సీఈ బి.శివరామ్రెడ్డి, పలువురు ఎస్ఈలు, అధికారులు పాల్గొన్నారు.


