గజలక్ష్మిగా జగన్మాత | - | Sakshi
Sakshi News home page

గజలక్ష్మిగా జగన్మాత

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

భద్రాచలం: ఆదిపరాశక్తి అనుగ్రహం కోసం భక్తజనం పరవశించే పవిత్ర శరన్నవరాత్రి వేళ భద్రగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో దర్శనమివ్వగా, జగన్మాతను దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. సకల శుభాలకు, ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావించే గజలక్ష్మి అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమార్చన జరిపారు. మారుతి సదనంలో వేద పండితులు, అర్చకులు భక్తిశ్రద్ధలతో అయోధ్యకాండ పారాయణం నిర్వహించి శ్రీరాముని ఆదర్శ జీవన విశేషాలను స్మరించారు. గురువారం శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

కనులపండువగా కల్యాణం

సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవతో పాటు సేవాకాలం, ఆరాధన తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణం కోసం రామసేవా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. కల్యాణ క్రతువులో భాగంగా స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

నేడు ధనలక్ష్మి రూపంలో అలంకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement