167 చెరువుల్లోనే చేప పిల్లలు | - | Sakshi
Sakshi News home page

167 చెరువుల్లోనే చేప పిల్లలు

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

ఈసారి 7 లక్షల బంగారు తీగలు..

పాల్వంచరూరల్‌: నీటి లభ్యత ఆధారంగా చెరువుల్లో చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. జలవనరుల శాఖ నివేదిక ఆధారంగా నీళ్లు నిండిన 167 చెరువుల్లోనే వదిలేందుకు సిద్ధమవుతోంది. చేప పిల్లల పంపిణీ ఆలస్యమైన కొద్దీ చెరువుల సంఖ్య తగ్గుతోంది.

అంచనాలు తారుమారు

నిర్దేశించిన ప్రతిపాదనల ప్రకారం జిల్లాలో 763 చెరువుల్లో కోటి 20 లక్షల చేపపిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. చివరికి 88 లక్షలే విడుదల చేయాలని నిర్ణయించారు. గత ఆగస్టులో జలవనరుల శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఐదు నియోజకవర్గాల పరిధిలోని 605 చెరువుల్లో చేపపిల్లలను వదలాలని భావించారు. పంపిణీ ప్రక్రియ జాప్యం కావడంతో అంచనాలు తారుమారయ్యాయి. ప్రస్తుతం చెరువుల్లో నీటి లభ్యత ఆధారంగా చెరువుల సంఖ్యతోపాటు వదిలే చేప పిల్లల సంఖ్య కూడా తగ్గింది. కేవలం 76 లక్షల చేపపిల్లలను మాత్రమే చెరువుల్లో వదలనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్‌ తెలిపారు. మత్స్యపారిశ్రామిక కమిషన్‌ ఆదేశాలతో షెడ్యూల్‌ ఖరారు చేస్తామని పేర్కొన్నారు. 80నుంచి 100 ఎంఎం సైజు కలిగినవి 38 లక్షలు, 35నుంచి 40 ఎంఎం సైజు కలిగినవి 38 లక్షల చేపపిల్లలను విడుదల చేయనున్నారు. బొచ్చె, రవ్వ, మోసు, బంగారు తీగ నాలుగు రకాల చేపపిల్లలను ఆయా నీటివనరుల్లో వదలనున్నారు.

గతేడాది బంగారు తీగ రకం చేపపిల్లల కొరత కారణంగా జిల్లాలో వాటిని పంపిణీ చేయలేదు. బంగారు తీగ రకం చేపలకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుంది. ఈ రకం చేప పిల్లలను పెంచాలని మత్స్యసొసైటీలు పట్టుబట్టారు. అదును దాటిన తర్వాత కాంట్రాక్టర్లు పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టడంతో బంగారు తీగ రకం ఎక్కడా దొరకలేదు. అయితే ఈ ఏడాది మాత్రం 35 నుంచి 40 ఎంఎం సైజు కలిగిన 7 లక్షల బంగారు తీగ చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేయాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement