భద్రాచలం/భద్రాచలంటౌన్: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. నిత్యకల్యాణం ఘనంగా జరిపారు. స్వామివారిని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ దర్శించుకుని పూజలు చేశారు. సాయంత్రం అర్చకులు గోదావరి మాతకు నదీహారతి నిర్వహించారు. భద్రాచలం డీఎస్పీ ఎం.అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెడీమేడ్ బట్టల షాపుల అసోసియేషన్ పూజా సామగ్రిని సమకూర్చారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన భక్తులు శ్రీనివాసరావు, పద్మప్రియ దంపతులు అన్నదానం నిమిత్తం రూ.లక్ష విరాళం అందించారు. కరీంనగర్‌కు చెందిన మంత్రాలయ ఫ్లోరింగ్స్, విరాజ్ మార్కెటింగ్ కంపెనీల నిర్వాహకులు దేవస్థానానికి రాతి, వెండి గిన్నెలను విరాళంగా అందించారు.


