పాల్వంచరూల్: జిల్లాలో ఆదివారం జోరుగా మద్యం విక్రయాలు సాగాయి. పలుచోట్ల మద్యం కొరత నెలకొంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతోపాటు ఇతర ప్రాంతాల్లో బీర్లు దొరకలేదు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా బీర్లు, ఇతర మద్యం విక్రయాలు జోరుగా సాగినట్లు తెలుస్తోంది. రూ. 3 వేలకు పైగా ధర ఉన్న లిక్కర్ మాత్రమే ఉన్నట్లు, మిగతావి అన్ని విక్రయమైనట్లు సమాచారం. ఆదివారం జిల్లాలో ఏ మద్యం దుకాణం ముందు చూసినా సందడి వాతావరణం కనిపించింది. వైన్స్‌తోపాటు బెల్ట్‌షాపుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు మద్యంబాబులు పొరుగునే ఉన్న ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వెళ్లి మద్యం తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. దసరా, నూతన సంవత్సర వేడుకల రోజు విక్రయాలు అధికంగా ఉంటాయని, ఈసారి స్నేహితుల దినోత్సవం రోజూ రెట్టింపు విక్రయాలు జరిగాయని ఓ వ్యాపారి తెలిపారు. నెలలో మొదటి ఆదివారం, ఫ్రెండ్‌షిప్ డే, పలుచోట్ల బోనాల పండుగ నిర్వహించడంతో అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, జిల్లావ్యాప్తంగా ఆదివారం సుమారు రూ. 6 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగినట్లు పాల్వంచ ఎకై ్సజ్ సీఐ ప్రసాద్ తెలిపారు.
ఎకై ్సజ్ శాఖకు ఒక్కరోజే
రూ. 6 కోట్ల ఆదాయం


