●యథావిధిగా రాగిజావ, మధ్యాహ్న భోజనం | - | Sakshi
Sakshi News home page

●యథావిధిగా రాగిజావ, మధ్యాహ్న భోజనం

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

●యథావిధిగా రాగిజావ, మధ్యాహ్న భోజనం

జిల్లాలోని 1,332 ప్రభుత్వ పాఠశాలల్లో 62,532 మంది విద్యార్థులకు సోమవారం నుంచి యథావిధిగా ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనం వడ్డించనున్నారు. ఈ ఏడాది నుంచి పాఠశాలల్లో అల్పాహారం కూడా ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం కొన్ని జిల్లాలను మాత్రమే పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల్లో రాగిజావ, మధ్యాహ్నభోజనం మాత్రమే అమలు జరుగనుంది. కాగా విద్యార్థుల యూనిఫాం క్లాత్‌ ఇప్పటివరకు జిల్లాకు చేరలేదు. రెండు రోజుల్లో క్లాత్‌ వస్తుందని, వెంటనే కుట్టించి విద్యార్థులకు అందజేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement