కొమరయ్య సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

కొమరయ్య సేవలు చిరస్మరణీయం

Jun 9 2026 4:48 AM | Updated on Jun 9 2026 4:48 AM

రుద్రంపూర్‌: సింగరేణి కార్మిక లోకానికి మనుబోతుల కొమరయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి మనుబోతుల కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ బొగ్గు గనుల్లో ఎని మిది గంటల పని విధానాన్ని సాధించిన ఘనత కొమరయ్యదేనని గుర్తుచేశారు. భూగర్భ గనుల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే మహిళా కార్మికులకు సర్ఫేస్‌ ఉద్యోగాలు కల్పించటంలో కీలక పాత్ర పోషించారని, పదేళ్లలోపు పిల్లలతో పనులు చేయించే అమానవీయ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, బొగ్గు గనుల్లో బాలకార్మిక వ్యవస్థకు ఆనాడే స్వస్తి పలికించారని గుర్తుచేశారు. కొమరయ్య ఆశయసాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ మూడ్‌ గణేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా, యూనియన్‌ నాయకులు రాజ్‌కుమార్‌, మిరి యాల రంగయ్య, వంగా వెంకట్‌, జీ.వీరస్వామి, రమణమూర్తి, మల్లికార్జున్‌రావు, సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, కొమరయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కూనంనేని

Advertisement
 
Advertisement
Advertisement