సూపర్‌బజార్(కొత్తగూడెం):నిరుద్యోగులను ఉద్యో గస్తులుగా తీర్చిదిద్దేందుకు బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి రూపొందించిన
Rakesh Reddy E& Classes యాప్‌ను సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో ఎంపీవద్దిరాజు రవిచంద్ర ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేసీఆర్ పదేళ్ల కాలంలో సుమారు 1.67లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగాల ఊసెత్తడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ కేవలం నిరుద్యోగుల పక్షాన పోరాడటమే కాకుండా వారి ప్రిపరేషన్‌లో కూడా తోడుగా ఉంటుందన్నా రు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 2న ఉద్యోగ ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఆశిస్తే.. నిరాశే ఎదురైందన్నారు. ఒక్క ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి, రెండున్నరేళ్ల తర్వాత 5వేల ఉద్యోగాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వ ర్లు, నాయకులు దిండిగాల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, కిలారు నాగేశ్వరరావు, మానే రామకృష్ణ, వన మా రాఘవేందర్, అనుదీప్, జలీల్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


