ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల వెల్లడైన బీపీఈడీ ఎంట్రెన్స్ ఫలితాల్లో ఖమ్మంకు చెందిన రామడుగు నరేందర్ రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన జాతీయస్థాయిలో బాస్కెట్‌బాల్, నెట్‌బాల్ క్రీడల్లో రాణించడమే కాక యూనివర్సిటీ స్థాయి బాస్కెట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆయన తండ్రి రోజువారీ కూలీగా పనిచేస్తూనే నరేందర్‌కు క్రీడలపై ఉన్న ఆసక్తి దృష్ట్యా శిక్షణ ఇప్పించాడు. మరోపక్క నరేందర్ సైతం వివిధ సంస్థల్లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే చదువుకుని బీపీఈడీ ఎంట్రెన్స్‌లో రాష్ట్రస్థాయి ఐదో ర్యాంక్ సాధించడంపై నెట్‌బాల్ సంఘం జిల్లా మాజీ కార్యదర్శి పీ.వీ.రమణ, తదితరులు అభినందించారు.
బీపీఈడీ ఎంట్రెన్స్‌లో
రాష్ట్ర ఐదో ర్యాంక్


