న్యాయం చేయాలని బాధితుల వినతి
టేకులపల్లి: టేకులపల్లి గ్రామపంచాయతీ మూడ్ తండాకు చెందిన మూడ్ వస్రాం (65) కుటుంబా న్ని తండా పెద్దలు సామాజిక, కుల బహిష్కరణ చేశారు. ఈ మేరకు బాధితుడు సోమవారం టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథ నం ప్రకారం... ఇటీవల తండాలో తన పిన్ని మూడ్ హీమిలి మృతిచెందగా తండా సంప్రదా యం ప్రకారం నిర్వహించే కార్యక్రమాలకు తమ కుటుంబానికి సమాచారం ఇవ్వలేదన్నారు. చేతబడి నెపంతో తమను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తూ, శుభకార్యాలకు కూడా రాకూడదని ఆంక్షలు విధించారని తెలిపారు. తండా నాయకుడు, అతని కుమారుడు తమ స్థలంలో అక్రమంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారని ఆరోపించా రు. సామాజిక బహిష్కరణ కారణంగా తమ ఇంట్లో చిన్నపిల్లలతో కూడా ఎవరూ మాట్లాడటం లేదని, కనీసం ఆడుకోవడానికి కూడా పిల్లలను రానివ్వకుండా కన్నీరుమున్నీరయ్యాడు. చట్టపరమైన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని టేకులపల్లి పోలీసులను వేడుకున్నాడు.
పురాతత్వ శాఖతో
డిగ్రీ కళాశాల ఒప్పందం
పాల్వంచరూరల్: చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణ, భావితరాలకు చరిత్రపై అవగాహన పెంపొందించేందుకు పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పురాతత్వశాఖతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సోమవారం పురాతత్వశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశా ల ప్రిన్సిపాల్ పి.పద్మ, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ వేముల కామేశ్వరరావు ఒప్పందంపై సంతకాలు చేశారు.
హిందీ భాష అభివృద్ధిపై దృష్టి
గిరిజన విద్యార్థుల్లో హిందీ భాష అభివృద్ధిపై దృష్టి సారించినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ బి.సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం ఆయన సందర్శించి, మొక్కలు నాటి మాట్లాడారు. అధికారులు నాగరాజు, రాజు, మల్లికార్జున్, అరుణకుమారి, మాధవి పాల్గొన్నారు.
పేకాట శిబిరంపై దాడి
దమ్మపేట: రంగువారిగూడెం శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. తొమ్మిది మంది పేకా టరాయుళ్లను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. మూడు బైక్‌లు, రూ, 9,530 నగదు స్వ్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.
భూ వివాదంలో
వ్యక్తికి గాయాలు
సుజాతనగర్: భూ వివాదంలో ఓ వ్యక్తి గాయపడిన సంఘటన మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సుజాతనగర్ రెవెన్యూ లక్ష్మీదేవిపల్లిలో వ్యవసాయ భూమికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం సాగుతోంది. ఈ క్రమంలో చుంచుపల్లికి చెందిన మూడ్ భీముడు పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా, చిట్టిరామవరానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గాయాలు కాగా చికిత్స నిమిత్తం కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.


