కూల్చిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కూల్చిన చోటే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి

Jun 9 2026 4:48 AM | Updated on Jun 9 2026 4:48 AM

ఖమ్మం అర్బన్‌: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అక్కడే స్థల పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేంద్ర ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డిమాండ్‌తో సోమవారం ఖమ్మంలో భూదాన్‌ బాధితుల నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ బాధితుల సమస్యలను రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉత్తరాల ద్వారా తెలియజేశామని చెప్పారు. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన వారికి 100 గజాల స్థలంలో తిరిగి ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. బాధితుల పోరాటానికి అన్ని పార్టీలు, సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వంజాకుల లక్ష్మీనారాయణ, నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్‌ కేవీ.కృష్ణారావుతో పాటు వట్టే ఉదయ్‌కిరణ్‌, మట్టే నవ్య, సుమలత, రామకృష్ణ, కృష్ణ, రాము పాల్గొన్నారు.

వెలుగుమట్ల బాధితుల ర్యాలీ

Advertisement
 
Advertisement
Advertisement