బీపీఈడీ ఎంట్రెన్స్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు | - | Sakshi
Sakshi News home page

బీపీఈడీ ఎంట్రెన్స్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

కొణిజర్ల: మండలంలోని తనికెళ్ల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఈడీ) ఎంట్రన్స్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన ఎం.శిరీష రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించగా, డి.ఉమ 243, బి.అఖిల 396, పి.ఇందు 447, టి.ప్రమీల 592, కె.సౌమ్య 1,013వ ర్యాంకు సాధించింది. ఆయా విద్యార్థినులను ప్రిన్సిపాల్‌ కె.రజని, వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.రాజేశ్వరి, పీడీ బి.రమ్య, వివిధ విభాగాల కోఆర్డినేటర్లు డాక్టర్‌ కే.పీ.ఐశ్వర్య, దీప్తి, ఎం.నవ్య అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement