పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం జిల్లా నలు మూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిట లా డింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, క్యూలైన్ ద్వారా భక్తులు దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక దరఖాస్తులు అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజా వాణి నిర్వహించనున్నట్లు వివరించారు.
కిన్నెరసానిలో
బోటు షికారు
పాల్వంచరూరల్: కిన్నెరసాని రిజర్వాయర్‌లో పర్యాటకులు జలవిహారం చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు కిన్నెరసానికి తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. 575 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.30,240 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.14,710 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సురక్షితమైన ఆహారం
అందించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు సురక్షిత ఆహారం అందించాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా ఆహార భద్రతా విభాగం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు ఆహార భద్రత శిక్షణ, ధ్రువీకరణ కార్యక్రమం నిర్వహించారు. 300 మంది అంగన్‌వాడీ టీచర్లు పాల్గొనగా, డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సురక్షితమైన ఆరోగ్యం ప్రధాన ఉద్దేశంగా ఉండాలన్నారు. జిల్లాలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని, కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రతా అధికారి శరత్ తెలిపారు. అనంతరం ఆహార భద్రత ప్రతిజ్ఞ చేయించారు.
ఎండోమెంట్ ఇన్‌చార్జి డీఈగా రవీందర్
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈఈగా పనిచేస్తున్న వేగేశ్న రవీందర్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ శాఖ డీఈ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా రవీందర్ ఇక నుంచి ఇన్‌చార్జి డీఈగా విధులు నిర్వర్తించనున్నారు.


