సమస్యలు పరిష్కరించకపోతే
పోరాటం తప్పదు
ఏఐటీయూసీ కేంద్ర కౌన్సిల్ సమావేశంలో గౌరవాధ్యక్షుడు కూనంనేని
నేడు యూనియన్ కొమురయ్య
కాంస్య విగ్రహ ఆవిష్కరణ
కొత్తగూడెంఅర్బన్: సంస్థ మనుగడకు కారణమైన కార్మికులను సింగరేణి యాజమాన్యం చిన్న చూపు చూడటం తగదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఆదివా రం నిర్వహించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్ర కౌన్సిల్ సమావేశం తొలి రోజు కార్యక్రమంలో మాట్లాడారు. ఇకనైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవా లని, సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలు తప్పవని అన్నారు. కార్మిక హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు విఘాతం కలిగించే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావా ల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, కొత్త గనుల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని, నిలిచిపోయిన మెడికల్ బోర్డులను పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు, ప్రమోషన్లు, క్లర్క్ పోస్టుల భర్తీ, డిస్మిస్ అయిన కార్మికులకు ప్రత్యేక అవకాశం కల్పించడం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతా రామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఆదాయపు పన్నును యాజ మాన్యమే భరించాలని, స్టక్చ్రర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూని యన్ మాజీ ప్రధాన కార్యదర్శి మనుబోతుల (యూనియన్) కొమురయ్య కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల రంగయ్య, సారయ్య, కందికట్ల వీరభద్రయ్య, వై.వి.రావు, ముస్కే సమ్మయ్య, వంగా వెంకట్, వీరస్వామి పాల్గొన్నారు.


