చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలి

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

మందమర్రిలో కొత్తగూడెం డిపో బస్సు బోల్తా

మందమర్రిరూరల్‌: మంచిర్యాల జిల్లా మందమర్రి లోని జాతీయ రహదారిపై కేకే ఓసీపీ సమీపాన కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్‌ 28 జెడ్‌ 0109) ఆదివారం తెల్లవారుజామున బోల్తాపడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న బస్సు ఓసీపీ సమీపాన అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. తెల్లవారుజామున ప్రమాదం జరగడం, ఆ సమయాన రోడ్డుపై రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో డ్రైవర్‌ సీతారామ్‌, తాళ్లగురిజాలకు చెందిన ప్రయాణికుడు ప్రవీణ్‌కుమార్‌ మాత్రమే ఉన్నారు. వీరిద్దరికి స్వల్పగాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆపై పట్టణ ఎస్‌ఐ నరేశ్‌ ఆధ్వర్యాన రాకపోకలకు ఇబ్బంది రాకుండా బస్సును పక్కకు తొలగించారు. కాగా, బస్సు డ్రైవర్‌ సీతారామ్‌కు అకస్మాత్తుగా బీపీ పడిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

మోటార్‌ సైకిల్‌ దగ్ధం

మణుగూరుటౌన్‌: మున్సిపాలిటీ పరిధిలోని సీఎస్పీ కాంటా వద్ద ఓ మోటార్‌ సైకిల్‌కు అకస్మాత్తుగా మంటలంటుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మణుగూరు నుంచి విజయనగరం గ్రామానికి ప్రేమ్‌కుమార్‌ తన పల్సర్‌ బైక్‌పై వెళ్తున్నాడు. సీఎస్పీ కాంట వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే బైక్‌ పూర్తిగా దగ్ధమైంది.

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో త్రీఇంకై ్లన్‌లోని తెలంగాణ క్రీడా మైదానంలో 40 రోజులపాటు కొనసాగిన రెజ్లింగ్‌ వేసవి శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. పరిసర ప్రాంతాలకు చెందిన 50 మంది బాల, బాలికలు ఈ రెజ్లింగ్‌ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. శిక్షణ పొందిన బాల, బాలికలకు జిల్లాస్థాయిలో పలు కేటగిరీల్లో రెజ్లింగ్‌ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచినవారికి స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ పతకాలు, సర్టిఫికెట్లు అందజేసి, మాట్లాడారు. చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలని, క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్‌ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. జిల్లా రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పెదపాటి కాశీహుస్సేన్‌ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో త్రీఇంకై ్లన్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ ఈసం ప్రవళ్లిక, ఉప సర్పంచ్‌ పాల్తీయ లక్ష్మి, జిల్లా ఇండియన్‌ స్టైల్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బరిగెల భూపేశ్‌, జిల్లా రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు ఆదినారాయణ, గుగులోతు కృష్ణ, బోడ గణేశ్‌ పలువురు కోచ్‌లు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

స్పెషల్‌ బ్రాంచ్‌

పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌

Advertisement
 
Advertisement
Advertisement